KL RAHUL: అతడు జూనియర్ యువరాజ్.. ఇతడు జూనియర్ ధోని

ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచి వారి స్థానాలను భర్తీ చేసే వారి కోసం టీమ్‌ ఇండియా వెతుకుతూనే ఉంది. ఇప్పుడు కేఎల్ రాహుల్‌ తన అనుభవంతో భర్తీ చేస్తాడని భావిస్తున్నా. వికెట్ కీపర్-బ్యాటర్‌ అయిన కేఎల్ తప్పకుండా ఐదో స్థానంలో సరిపోతాడనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 12:16 PM IST

KL RAHUL: మెగా టోర్నీల్లో టీమ్‌ఇండియా నాలుగో స్థానంపై చర్చ జరుగుతుండగా.. భారత సీనియర్‌ ఆటగాడు అశ్విన్ తాజాగా ఐదో స్థానంలో వచ్చే బ్యాటర్‌పై మరిన్ని బాధ్యతలు ఉంటాయని చెబుతున్నాడు. దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, యువ్‌రాజ్‌ సింగ్‌ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత ఈ స్థానం కోసం భారత్‌ సరైన ఆటగాడిని వెతుకుతూనే ఉందని వ్యాఖ్యానించాడు. యువీ నాలుగో స్థానంలో.. ధోనీ ఐదో స్థానంలో క్రీజ్‌లోకి రావడం వల్ల భారత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా ఉండేదని గుర్తు చేశాడు.

‘‘ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికినప్పటి నుంచి వారి స్థానాలను భర్తీ చేసే వారి కోసం టీమ్‌ ఇండియా వెతుకుతూనే ఉంది. ఇప్పుడు కేఎల్ రాహుల్‌ తన అనుభవంతో భర్తీ చేస్తాడని భావిస్తున్నా. వికెట్ కీపర్-బ్యాటర్‌ అయిన కేఎల్ తప్పకుండా ఐదో స్థానంలో సరిపోతాడనిపిస్తోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. “కేఎల్ రాహుల్‌ ఎంత ముఖ్యమో శ్రేయస్‌ అయ్యర్ కూడా అంతే ముఖ్యం. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో అత్యుత్తమ ఆటగాడు అయ్యర్. నాలుగో స్థానంలో సరిగ్గా సరిపోతాడు. స్పిన్‌ను కూడా సమర్థంగా ఆడతాడు. గతంలోనూ ఇదే స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే నాలుగో స్థానానికి ఢోకా ఉండదు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు. ఆగస్ట్ 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం భారత్ 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అదనంగా స్టాండ్‌ బై ప్లేయర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది.