WORLD CUP 2023: ఆటలోనే కాదు.. సేవలోనూ రాహుల్ టాప్..!

ధార్వాడలోని సిద్దేశ్వర్‌ కాలనీకి చెందిన హనుమంతప్ప, సుమిత్ర దంపతుల కుమార్తె సృష్టి భవిష్యత్తులో డాక్టర్‌ కావాలని కలలు కంది. అయితే ఆ బాలిక కలకు పేదరికం అడ్డంకిగా మారింది. ఈ కుటుంబం పడుతున్న కష్టాలను తెలుసుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మంజునాథ్ హెబాసూర్ కేఎల్ రాహుల్‌ను సంప్రదించాడు.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 07:35 PM IST

WORLD CUP 2023: టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో టాప్‌ క్లాస్‌ ఫామ్‌తో ఆకట్టుకుంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. కాగా ఆటతోనే కాకుండా.. తన సేవా కార్యక్రమాలతోనూ రాహుల్ వార్తల్లో నిలుస్తున్నాడు. పేదరికంతో బాధపడుతోన్న ఓ విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ధార్వాడలోని సిద్దేశ్వర్‌ కాలనీకి చెందిన హనుమంతప్ప, సుమిత్ర దంపతుల కుమార్తె సృష్టి భవిష్యత్తులో డాక్టర్‌ కావాలని కలలు కంది.

అయితే ఆ బాలిక కలకు పేదరికం అడ్డంకిగా మారింది. ఈ కుటుంబం పడుతున్న కష్టాలను తెలుసుకున్న ప్రముఖ సామాజిక కార్యకర్త మంజునాథ్ హెబాసూర్ ప్రముఖ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను సంప్రదించాడు. అమ్మాయి ఆర్థిక కష్టాలను టీమిండియా క్రికెటర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించిన రాహుల్‌ ఆ అమ్మాయి చదువుకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేశాడు. ఓ విద్యార్థికి చదువు కోసం ఆర్థిక సాయం చేసి చాలా మంచి పనిచేశాడంటూ అభిమానులు, నెటిజన్లు టీమిండియా క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.