ముంబై వన్డే లో k l రాహుల్ ఆడుతుంటే అందరి కళ్ళు బైర్లు కమ్మాయి. ఏడాది కాలం గా అభిమానుల్ని విసిగిస్తూ..ఏడిపిస్తూ… డక్ ఔట్లతో ,సింగల్ స్కోర్స్ తో పిచెక్కించిన రాహులేనా అనిపించాడు. కొద్దీ రోజుల క్రితం జట్టులో స్థానం కోల్పోయిన ఈ వికెట్ కీపర్ కం ఓపెనర్ మళ్ళీ ఇండియా ఆస్ట్రేలియా ముంబై వన్డే తో ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ ని చూడగానే అందరూ తిట్టుకున్నారు. వీడు ఇంక పోడా అనుకున్నారు. కొట్టాల్సింది 189 పరుగుల టార్గెట్ తక్కువ స్కోరే అయినా టాప్ ఆర్డర్ బాట్స్మన్ సింగల్ స్క్రోర్స్ కె లైన్ కట్టేశారు. 39 పరుగులకి 4 వికెట్లు రాలిపోయాయి. ఇషాన్ కిషన్ 3, కోహ్లీ 4 రన్స్ కొట్టి ఔటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి వన్డే లో ఫెయిల్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన రాహుల్ జట్టు గెలుపు భారాన్ని భుజాన్న వేసుకున్నాడు..91 బంతుల్లో 75 రన్స్ కొట్టి అజేయంగా నిలిచాడు అంతే కాదు జడేజా కూడా 45 పరుగులు కొట్టి జట్టు గెలుపు కు చేయివేసాడు. అలాగే హార్దిక్ కూడా 25 పరుగులతో ఆదుకున్నాడు.రాహుల్ జడేజా భాగస్వామ్యం 108 రన్స్. రాహుల్ స్కోర్ లో 7 ఫోర్లు…ఒక సిక్స్ ఉన్నాయి. రాహుల్ ఏమాత్రం కంట్రోల్ కోల్పోయినా ముంబై వన్డే చేజారి పోయేది. మొత్తానికి రాహుల్ కి గ్రహణమ్ వీడింది. తన్ని తిట్టే వాళ్ళకి తన ఆట తోనే ఆన్సర్ ఇచ్చాడు KL రాహుల్