KL Rahul: ముగ్గురి మధ్య మంట పెట్టిన సునీల్ గవాస్కర్..

వన్డే ప్రపంచ కప్‌ కోసం ప్రకటించే జట్టులోనూ కేఎల్ ఉండే అవకాశాలు ఎక్కువే. దీంతో సూపర్ -4లో రాహుల్‌ను ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే, అతడిని తుది జట్టులోకి తీసుకోవాలంటే ఒకరిని రిజర్వ్‌కు పరిమితం చేయాల్సి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 03:17 PM IST

KL Rahul: ఆసియా కప్‌లో భారత్ సూపర్ – 4 స్టేజ్‌కు వెళ్లిపోయింది. అయితే, తుది జట్టు ఎంపికపై మాత్రం తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఫిట్‌నెస్‌ నిరూపించుకుని కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తాడు. అలాగే వన్డే ప్రపంచ కప్‌ కోసం ప్రకటించే జట్టులోనూ కేఎల్ ఉండే అవకాశాలు ఎక్కువే.

దీంతో సూపర్ -4లో రాహుల్‌ను ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే, అతడిని తుది జట్టులోకి తీసుకోవాలంటే ఒకరిని రిజర్వ్‌కు పరిమితం చేయాల్సి ఉంటుంది. వికెట్‌ కీపర్‌గా ఉన్న ఇషాన్‌ కిషన్‌ను తప్పించే అవకాశం లేదు. పాక్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో ఎవరిని తప్పించనున్నారనేది కీలకం కానుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం కేఎల్ రాహుల్‌ను తీసుకోవాలంటే శ్రేయస్‌ అయ్యర్‌ను పక్కన పెట్టాలని సూచించాడు.

ఇషాన్‌ కిషన్‌ తుది జట్టులో ఉండాల్సిందేనని వ్యాఖ్యానించాడు. పాక్‌పై 80 ప్లస్ పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌ను తప్పించలేరు. క్లిష్టమైన పరిస్థితుల్లో విలువైన పరుగులు సాధించాడు. ఇషాన్‌ను రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చోబెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఎడమచేతివాటం బ్యాటర్‌ కావడం వల్ల జట్టు కూర్పులోనూ మరింత వైవిధ్యం వచ్చినట్లవుతుంది’’ అని సునీల్ గావస్కర్‌ తెలిపాడు.