Jasprit Bumrah: బూమ్రా రీఎంట్రీ, రాహుల్ ఔట్.. ఐదో టెస్టుకు భారత జట్టు ఇదే

బూమ్రా లేకున్నా భారత పేసర్లు సత్తా చాటడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్‌సేన సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ధర్మశాల పిచ్‌ దృష్ట్యా బూమ్రాకు తిరిగి చోటు కల్పించింది. ఇదిలా ఉంటే జట్టు ప్రకటనతో పాటు స్టార్ క్రికెటర్లు మహ్మద్ షమి, కేఎల్ రాహుల్ గాయాలపై బీసీసీఐ వివరణ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 06:56 PM IST

Jasprit Bumrah: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్టుగానే జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రాగా.. కేఎల్ రాహుల్ ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. తొలి మూడు టెస్టులు ఆడిన బూమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌కు విశ్రాంతినిచ్చారు. బూమ్రా లేకున్నా భారత పేసర్లు సత్తా చాటడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్‌సేన సిరీస్ కైవసం చేసుకుంది.

KTR VS REVANTH REDDY: మల్కాజ్‌గిరిలో తేల్చుకుందాం.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్..

అయితే ధర్మశాల పిచ్‌ దృష్ట్యా బూమ్రాకు తిరిగి చోటు కల్పించింది. ఇదిలా ఉంటే జట్టు ప్రకటనతో పాటు స్టార్ క్రికెటర్లు మహ్మద్ షమి, కేఎల్ రాహుల్ గాయాలపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. రాహుల్‌ను బీసీసీఐ వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తోందని, లండన్‌ వైద్యుల సమన్వయంతో చికిత్స అందిస్తోందని తెలిపింది. కాగా, కుడి చీలమండ సమస్యతో బాధపడున్న మహ్మద్ షమి.. ఫిబ్రవరి 26న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. షమీ ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడు. త్వరలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకు వెళ్లి చికిత్స పొందుతాడని తెలిపింది. మరోవైపు వాషింగ్టన్ సుందర్‌ను స్క్వాడ్‌ నుంచి రిలీజ్ చేశారు. మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో తమిళనాడు‌ తరఫున సుందర్ బరిలోకి దిగుతాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి.

సెమీస్ ముగిసిన అనంతరం అవసరాలను బట్టి సుందర్ భారత జట్టుతో చేరుతాడు. మార్చి 7వ తేదీ నుంచి ధర్మశాల వేదికగా చివరి టెస్టు ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు ముందు వారం రోజులు సమయం దొరకడంతో భారత ఆటగాళ్లు కుటుంబాలతో గడిపేందుకు బీసీసీఐ అనుమతించింది. అటు ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా రిలాక్స్ అవుతున్నారు.