Ind vs Eng: ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్ గెలిచి జోష్ మీద ఉన్న భారత్‌కు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా గత రెండు టెస్టులు ఆడని రాహుల్ కోలుకున్నాడని.. రాంచీ టెస్టులో ఆడతాడని వార్తలు వచ్చాయి.
Hyderabad Ranji Team: బీఎండబ్ల్యూ కారు, కోటి రూపాయలు.. హైదరాబాద్ రంజీ జట్టుకు బంపరాఫర్
అయితే అతను పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తిరిగి కోలుకుంటేనే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. మరోవైపు పని భారం కారణంగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించిన బోర్డు.. అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. బుమ్రాకు మూడో టెస్టులోనే విశ్రాంతి ఇస్తారని భావించినా.. అతన్ని కొనసాగించారు. వరుసగా మూడు టెస్టులతో ఈ పేస్ బౌలర్‌పై భారం పెరిగిపోవడంతో నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇచ్చారు.
రాజ్‌కోట్ టెస్టు ఆడని ముకేశ్ నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో యూపీకి ఆడాలంటూ మూడో టెస్టు నుంచి ముకేశ్‌ను పంపించిన మేనేజ్‌మెంట్.. అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. బుమ్రా ఈ సిరీస్‌లో 17 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఉన్నాడు. ఇప్పుడతడు లేకపోవడంతో పేస్ బౌలింగ్ భారం సిరాజ్‌పై పడనుంది.