KL Rahul: ఐడియా నాదే.. కానీ, క్రెడిట్ మాత్రం యాదవ్‌దే..!

రాహుల్ చెప్పినట్లుగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా.. మూడో బంతికి సమర విక్రమార్క స్టంపౌటయ్యాడు. ఇక ఈ వికెట్‌తో తనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న సమయంలో ఆ క్రెడిట్ అంతా కుల్దీప్ యాదవ్‌కి ఇచ్చేసాడు రాహుల్‌.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 06:53 PM IST

KL Rahul: ఆసియా కప్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలి మ్యాచులోనే పాక్‌పై సెంచరీ చేసిన కేఎల్.. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో 39 పరుగులు చేసి రాణించాడు. అయితే కంబ్యాక్‌లో బ్యాటర్‌గానే కాకుండా వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా సమర్ధవంతంగా పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ చెప్పిన ఒక సలహా వికెట్ వచ్చేలా చేసింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్‌తో సమర విక్రమార్క వికెట్ లభించింది.

వికెట్ల వెనుక మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేస్తూ.. అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న సమర విక్రమార్కకు నాలుగు లేదా ఐదో స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేయాలని యాదవ్‌కు సూచించాడు. రాహుల్ చెప్పినట్లుగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా.. మూడో బంతికి సమర విక్రమార్క స్టంపౌటయ్యాడు. ఇక ఈ వికెట్‌తో తనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న సమయంలో ఆ క్రెడిట్ అంతా కుల్దీప్ యాదవ్‌కి ఇచ్చేసాడు రాహుల్‌. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. “సమర విక్రమార్క వికెట్‌కు సంబంధించిన క్రెడిట్ నాకు కొంచెం కూడా దక్కదు.

అదంతా కుల్దీప్ యాదవ్ నైపుణ్యం. అతను ప్లాన్‌ను పకడ్బందీగా అమలు పరచడంతోనే వికెట్ దక్కింది. లక్కీగా నేను చెప్పిన చిట్కా పని చేసింది” అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కుల్దీప్‌కి క్రెడిట్ అంతా ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకున్నాడు రాహుల్.