రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఇదేం పెద్ద విషయం అనుకోకండి ఇక్కడే ఉంది అసలు మాటర్. ఈ డేట్ రోజు అలా ఔట్ అవ్వడమే.. ఇప్పుడు ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్‌కు వికెట్లు ముందు దొరికిపోయాడు. అయితే ఈ ఒక్కరోజే కాకుండా ఐపీఎల్‌లో ఏప్రిల్ 23న ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
2017 నుంచి ఈ మ్యాచ్ వరకు ఏప్రిల్ 23న మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మూడింటిలోనూ గోల్డెన్ డకౌటయ్యాడు. 2017లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్ అయిన విరాట్ కోహ్లీ.. గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీ ఘోర పరాజయం ఎదుర్కొంది. అయితే ఈసారి గుడ్డిలో మెల్ల ఏంటంటే.. ఈసారి బెంగుళూర్ గెలిచింది. విజయం సంగతి ఎలా ఉన్నా.. కోహ్లీ భాయ్ జర జాతకం చుపించుకో.. ఆ నంబర్ ఏదో తేడా ఉంది.. అవసరం అయితే మా సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయం నంబర్ ఇస్తాం అంటూ సోషల్ మీడియాలో జోక్ లు వేస్తున్నారు ఫ్యాన్స్.