Kohli  Record : మరో రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ..

రికార్డులను బ్రేక్‌ చేయడమే పనిగా పెట్టుకున్న కోహ్లీ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ఆస్ట్రేలియాతో ఫైనల్‌లో 54 రన్స్ చేసిన కోహ్లీ.. మరో రికార్డ్ క్రియేట్‌ చేశాడు. వాల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో ఎక్కువ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ వాల్డ్‌కప్‌లో కోహ్లీ 765 రన్స్ చేశాడు.  కోహ్ీల తర్వాత స్థానంలో సచిన్ ఉన్నాడు.  2003 వాల్డ్‌కప్‌లో సచిన్‌ అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 673 రన్స్‌ చేశాడు.

రికార్డులను బ్రేక్‌ చేయడమే పనిగా పెట్టుకున్న కోహ్లీ ఖాతాలో మరో ఘనత వచ్చి చేరింది. ఆస్ట్రేలియాతో ఫైనల్‌లో 54 రన్స్ చేసిన కోహ్లీ.. మరో రికార్డ్ క్రియేట్‌ చేశాడు. వాల్డ్‌కప్‌లో ఒక ఎడిషన్‌లో ఎక్కువ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ వాల్డ్‌కప్‌లో కోహ్లీ 765 రన్స్ చేశాడు.  కోహ్ీల తర్వాత స్థానంలో సచిన్ ఉన్నాడు.  2003 వాల్డ్‌కప్‌లో సచిన్‌ అన్ని మ్యాచ్‌ల్లో కలిపి 673 రన్స్‌ చేశాడు.  ఆ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇదొక్కటే కాదు.. టీ20 వాల్డ్‌కప్‌, ఐపీఎల్‌లోనూ సింగిల్‌ సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా.. కోహ్లీ రికార్డ్‌ క్రియేట్ చేశాడు. ఇక ఈ వాల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ 85 పరుగుల చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై 55 పరుగులు, పాకిస్తాన్‌పై 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై 103 నాటౌట్‌, న్యూజిలాండ్‌పై 95 రన్స్‌ చేశాడు. ఇంగ్లండ్‌పై డకౌట్ అయి నిరాశ పర్చాడు. శ్రీలంకపై 88, దక్షిణాఫ్రికాపై 101 నాటౌట్‌, నెదర్లాండ్స్‌పై 51 పరుగులు చేశాడు. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై 117 పరుగులతో అదరగొట్టాడు. ఈ సెంచరీతోనే వన్డేల్లో తన 50వ సెంచరీని విరాట్ కోహ్లీని అందుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ 49 సెంచరీల రికార్డును అధిగమించాడు. ఇక అటు ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 5 పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో.. కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను ఒడ్డుకు చేర్చాడు విరాట్. హాఫ్ సెంచరీ సాధించి అదరగొట్టాడు.