T20 World Cup : ఇదేం పిచ్‌ రా నాయనా.. పిచ్చి ఎక్కిస్తోంది

కొహ్లీ చేతులెత్తేస్తున్నాడు. రోహిత్‌ బావురుమంటున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా స్కోర్‌ 200 దాటడంలేదు. ఇదేం పిచ్‌రా బాబు అని టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్స్‌ గుండెలు బాదుకుంటున్నారు. డ్రాప్ ఇన్ పిచ్‌పై ఆడటం బ్యాటర్లకు సవాల్‌గా మారింది.

 

 

 

కొహ్లీ చేతులెత్తేస్తున్నాడు. రోహిత్‌ బావురుమంటున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా స్కోర్‌ 200 దాటడంలేదు. ఇదేం పిచ్‌రా బాబు అని టీ20 వరల్డ్ కప్‌లో ప్లేయర్స్‌ గుండెలు బాదుకుంటున్నారు. డ్రాప్ ఇన్ పిచ్‌పై ఆడటం బ్యాటర్లకు సవాల్‌గా మారింది. అనూహ్యంగా బౌన్స్ అవుతుండటంతో.. రిటైర్డ్ హర్ట్‌లుగా వెనుదిరుగుతున్నారు. దీంతో.. న్యూయార్క్ నస్సావ్ పిచ్ అంటేనే వరల్డ్ క్లాస్ బ్యాటర్లు కూడా వణికిపోతున్నారు. క్రికెట్‌లో ధనాధన్ పొట్టి మ్యాచ్‌ అంటే.. మ్యాచ్ మినిమం ఉంటుంది. బాల్ ఈజీగా బౌండరీ లైన్ దాటేస్తుంది. బ్యాటర్లు మీటర్లతో పోటీ పడి మరీ సిక్సుల మీద సిక్సులు స్టాండ్స్‌లోకి పంపించేస్తారు. కానీ.. టీ20 వరల్డ్ కప్‌ స్టార్ట్ అయ్యి 10 రోజులు దాటింది. ఇప్పటి వరకు ధనాధన్ ఇన్నింగ్స్‌ లేదు.. కళ్లు చెదిరే షాట్స్ లేవు. పైగా.. ఆడాలంటేనే బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా.. టీ20 వరల్డ్‌ కప్‌లో రిటైర్డ్ హర్ట్‌లుగానో.. గోల్డెన్ డక్‌లుగానో.. పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు.

ఇంతకీ న్యూయార్క్ నస్సావ్ పిచ్‌పై పరుగుల వరద ఎందుకు పారడం లేదు. ఎందుకంటే క్రికెట్ దిగ్గజాలు, హేమాహేమీలకు కూడా ఆ పిచ్ స్వభావం ఏంటో అర్థం కాలేదు. అసలు ఆ పిచ్ బ్యాటింగ్‌కి సహకరిస్తుందా? బౌలింగ్ కి సహకరిస్తుందా? ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అన్నింటికీ మించి.. నస్సావ్ కౌంటి స్టేడియంలో అన్నీ.. లో స్కోర్ మ్యాచులే జరిగాయి. వాస్తవంగా నస్సావ్ పిచ్.. డ్రాప్ ఇన్ పిచ్. ఈ స్టేడియం నిర్మించేందుకు 250 కోట్లు ఖర్చైంది. మ్యాచ్‌ జరిగే స్టేడియంలో కాకుండా బయట పిచ్‌ను రెడీ చేసి.. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి ఫిక్స్‌ చేస్తారు. ఎంసీజీలో 24 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతు ఉన్న పిచ్‌ను నల్లరేగడి మట్టితో తయారు చేసి దానిపై గ్రాస్‌ను ఉంచుతారు. స్టీల్‌ ఫ్రేమ్స్‌లో తయారు చేస్తారు. మ్యాచ్‌లు ఉన్న సమయంలో కస్టమైజ్డ్‌ ట్రక్‌లో తీసుకువచ్చి స్పెషల్ మెషిన్‌తో పిచ్‌ను డ్రాప్‌ చేస్తారు. మ్యాచ్‌లు అయిపోగానే.. మెషీన్‌తో దాన్ని అక్కడి నుంచి తీసేస్తారు. అందుకే ఈ స్టేడియం పిచ్‌ను డ్రాప్‌ ఇన్ పిచ్ అంటుంటారు.

న్యూయార్క్ స్టేడియంలో వాడేందుకు మొత్తం 10 డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లను తయారు చేశారు. ఇందులో నాలుగు మ్యాచ్‌ల కోసం.. మిగతావి వార్మప్‌ మ్యాచ్‌ల కోసం. ఇలాంటి పిచ్‌లు రెడీ చేయడానికి సుమారు రెండేళ్ల టైం పడుతుంది. కానీ.. టీ20 వరల్డ్ కప్‌ కోసం కేవలం మూడు నెలల్లోనే రెడీ చేశారు. దీంతో.. పిచ్‌లు ప్లేయర్లను ముప్పు తిప్పలు పెడుతోంది. డ్రాప్ ఇన్ పిచ్‌లలో అన్ని మ్యాచ్‌లు లో స్కోరింగ్ గేమ్స్‌గా మారాయి. అనూహ్య బౌన్స్, టర్న్, పేస్‌తో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. పిచ్‌లపై విమర్శలు వస్తుండటంతో.. 250 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన స్టేడియంను డిస్మెంటల్ చేయాలని నిర్వహాకులు భావిస్తున్నారు. నిన్న అమెరికా, భారత్ మ్యాచే ఈ పిచ్‌పై చివరి మ్యాచ్ అనే ప్రచారం జరుగుతోంది.