Kohli : కోహ్లీ,అయ్యర్ ఔట్.. 3 టెస్టులకు భారత్ జట్టు ఇదే

ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు.

ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి వైదొలిగాడు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్న కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండడం లేదు. అతని రిక్వెస్ట్ ను గౌరవించిన సెలక్షన్ కమిటీ కోహ్లీని ఎంపిక చేయలేదు. అలాగే గాయంతో ఇబ్బంది పడుతున్నశ్రేయాస్ అయ్యర్ కూడా సిరీస్ కు దూరమయ్యాడు. అయితే రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ జట్టులోకి తిరిగి వచ్చారు. గాయాల నుంచి కోలుకున్నప్పటకీ ఫిట్ నెస్ సాధిస్తేనే మూడో టెస్టులో వారిద్దరూ ఆడతారు.

బీసీసీఐ మెడికల్ టీమ్ వీరిద్దరికీ ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఇస్తేనే తుది జట్టులో చోటు దక్కుతుంది. వీరిద్దరినీ కొనసాగిస్తుండడంతోనే శ్రేయాస్ అయ్యర్ కు రీప్లేస్ మెంట్ గా మరొకరిని ఎంపిక చేయలేదు. ఇదిలా ఉంటే మిగిలిన జట్టులో ఎటువంటి మార్పులూ లేవు. అయితే దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సీనియర్ బ్యాటర్ పుజారాకు మరోసారి నిరాశే మిగిలింది. రీఎంట్రీపై అతను ఆశలు పెట్టుకున్నా సెలక్టర్లు పట్టించుకోలేదు. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో యువక్రికెటర్ల వైపే సెలక్షన్ కమిటీ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జట్టులో ఉన్న రజత్ పటిదార్, సర్ఫ్ రాజ్ ఖాన్ లలో ఒకరికి మూడో టెస్టులో ఆడే అవకాశం రానుంది.

ఐదు టెస్టుల సిరీస్ లో మూడో మ్యాచ్ రాజ్ కోచ్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలిస్తే… విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో దెబ్బకొట్టిన భారత్ లెక్క సరిచేసింది.