తక్కువ ధరకే ఆల్ రౌండర్, RCBకి కృనాల్ పాండ్యా

ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగావేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

  • Written By:
  • Publish Date - November 26, 2024 / 12:36 PM IST

ఐపీఎల్ టైటిల్ కల నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెగావేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ సారి బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ డెప్త్ ను పెంచుకున్నట్టే కనిపిస్తోంది. రెండోరోజు వేలంలో పలువురు స్టార్ ప్లేయర్స్ ను ట్రై చేసి వదిలేసిన తీసుకున్న కొద్ది మందిలో మంచి ఆటగాళ్ళనే దక్కించుకుంది. ముఖ్యంగా కృనాల్ పాండ్యాను గతంలో కంటే తక్కువ ధరకే పట్టేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మెరుపులు మెరిపించగల కృనాల్ ను 5.75 కోట్ల కే దక్కించుకుంది. కృనాల్ 2024 సీజన్ వరకూ లక్నో సూపర్ జెయింట్స్‌లో ఆడాడు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ క్యాంప్‌లో వచ్చి చేరాడు. అయితే ఈ ఆల్ రౌండర్ కోసం ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్‌తో గట్టిగానే తలపడాల్సి వచ్చింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కమ్ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ కోసం ఈ రెండు జట్లూ పోటీ పడ్డాయి. ఆర్టీఎమ్ ఆప్షన్ ఉన్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ఉపయోగించలేదు.

గ‌త ఏడాది కంటే ఈ వేలంలో మూడున్న‌ర కోట్లు త‌క్కువ‌కే కృనాల్ పాండ్య అమ్ముడయ్యాడు. గ‌త ఏడాది ఐపీఎల్ వేలంలో కృనాల్ పాండ్య‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 8.25 కోట్ల‌కు కొనుగులు చేసింది. రేటుకు త‌గ్గ ఆట లేక‌పోవ‌డంతో కృనాల్‌ను ల‌క్నో వ‌దులుకుంది. నాల్ పాండ్యా చేరికతో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ బలపడినట్టే. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మ.. వంటి మెరికలతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో కృనాల్ వచ్చి చేరడం అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మరింత రాటుదేలినట్టయింది. 2016లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు కృనాల్ పాండ్యా. ఆర్‌సీబీలో చేరడానికి ముందు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌ జెయింట్స్ జట్ల తరఫున ఆడాడు. ఐపీఎల్‌లో 127 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ 1,647 పరుగులు చేశాడు. ఈ ఆల్ రౌండర్ మంచి స్పిన్ బౌలర్ కావడంతో ఆర్సీబీ ఆసక్తి చూపింది. కృనాల్ ఇప్పటివరకు ఆడిన 127 మ్యాచ్‌లలో 76 వికెట్లు తీశాడు.