లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలం కాస్ట్ లీ ప్లేయర్ గా ఉదానా

రిటైరయిన దిగ్గజ ఆటగాళ్ళతో నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలుకానున్న సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం పూర్తయింది.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 07:59 PM IST

రిటైరయిన దిగ్గజ ఆటగాళ్ళతో నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. వచ్చే నెల మూడో వారం నుంచి మొదలుకానున్న సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం పూర్తయింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలంలో శ్రీలంక క్రికెటర్ ఇసురు ఉదానా అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. ఈ బౌలింగ్ ఆల్ రౌండర్ ను అర్బనైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 62 లక్షలకు సొంతం చేసుకుంది. అలాగే విండీస్ ప్లేయర్ చాద్విక్ వాల్టన్ ను కూడా హైదరాబాద్ జట్టు 60.36 లక్షలకు దక్కించుకుంది. ఇక ఆసీస్ క్రికెటర్ డానియల్ క్రిస్టియన్ ను మణిపాల్ టైగర్స్ 56 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ , దినేశ్ కార్తీక్ కూడా ఈ లీగ్ లో ఆడుతున్నారు. రాస్ టేలర్ , గ్రాండ్ హోమ్, వినయ్ కుమార్, రిచర్డ్ లెవీ, జీవన్ మెండిస్ , పవన్ నేగి వంటి ప్లేయర్స్ వేలంలో అమ్ముడయ్యారు.

అయితే బ్రెట్ లీ, మార్టిన్ గప్తిల్, ఆర్పీ సింగ్, ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్ , కామెరూన్ వైట్ వంటి స్టార్ ప్లేయర్స్ అమ్ముడుపోలేదు. మొత్తం ఆరు ఫ్రాంచైజీలు 40 కోట్ల వరకు వెచ్చించి 97 మంది ప్లేయర్స్ ను వేలంలో కొనుగోలు చేశాయి. కాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ మూడో సీజన్ లో మొత్తం 25 మ్యాచ్ లు అభిమానులను అలరించనున్నాయి. జోధ్ పూర్ , సూరత్ తో పాటు 40 ఏళ్ళ తర్వాత జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో క్రికెట్ మ్యాచ్ లు జరగనున్నాయి.