గత సంవత్సరం నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లను ఈ స్థానంలో ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ కచ్చితంగా నంబర్-4 బ్యాట్స్‌మెన్‌గా ముద్ర వేయగలిగారు. కానీ మిగిలిన ఆటగాళ్లు నిరాశపరిచారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లు ఫిట్‌గా లేరు. రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ నంబర్-4లో గరిష్టంగా ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్ ఇప్పటికి రెండుసార్లు యాభై పరుగుల మార్కును దాటాడు. అలాగే అతను 90.2 స్ట్రైక్ రేట్‌తో 57 సగటుతో 342 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ నాలుగో స్థానంలో 37.43 సగటు, 100.8 స్ట్రైక్ రేట్‌తో 262 పరుగులు చేశాడు. ఈ సమయంలో రిషబ్ పంత్ యాభై పరుగుల సంఖ్యను రెండుసార్లు దాటాడు. శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లతో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లను నంబర్-4లో ప్రయత్నించినప్పటికీ ఏ బ్యాట్స్‌మెన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. 2019 ప్రపంచకప్‌లో కూడా నంబర్ 4 స్థానమే టీమిండియాకు ఇబ్బందిగా మారింది. ప్రపంచ కప్‌కు ముందు అంబటి రాయుడును ఈ స్థానంలో ప్రయత్నించారు. కానీ ప్రపంచ కప్‌కు ఎంపిక కాలేదు.
అంబటి రాయుడు స్థానంలో విజయశంకర్‌ని ఎంపిక చేసినా అతను గాయం కారణంగా విజయశంకర్ టోర్నీ మొత్తం ఆడలేకపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ నంబర్ 4 స్థానంలో ఆడాడు. మరోవైపు వెస్టిండీస్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా శుభ్‌మన్ గిల్ బాగా నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో కూడా శుభ్‌మన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ పేలవమైన ఫామ్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు సమస్యగా మారింది. గిల్ పేలవ ఫామ్‌పై భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఆందోళన చెందడం లేదు. అతను బ్యాటింగ్ బాగా చేస్తాడని, గొప్ప టచ్‌లో కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు. ప్రతి ఒక్క మ్యాచ్ తర్వాత ఆటగాళ్లను విమర్శించలేమని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఐర్లాండ్ సిరీస్ లో రింకు సింగ్, జితేష్ శర్మ, గైక్వాడ్, శివమ్ దూబే రూపంలో సీనియర్లకు గట్టి పోటీ బయటపడనుంది. వరల్డ్ కప్ ముందు ఆడనున్న దాదాపు పది మ్యాచుల్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వారికి ఖచ్చితంగా నంబర్ 4 స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ స్థానం కోసం టీమిండియాలో ఏకంగా 8 మంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు.