IPL 2024: టీమ్స్‌ను వెంటాడుతున్న స్లో ఓవర్ రేట్.. కెప్టెన్లకు 12 లక్షల ఫైన్

ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ రూల్ అన్ని జట్లను వెంటాడుతోంది. రెండు సార్లు స్లో ఓవర్ రేట్ రూల్‌ను ఉల్లంఘిస్తే మూడోసారి జట్టు కెప్టెన్‌పై నిషేధం విధిస్తారు. ఈసారి ఐపీఎల్‌లో ఐదు జట్ల కెప్టెన్లు ఒక మ్యాచ్‌ నిషేధానికి అడుగు దూరంలో నిలిచారు.

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 05:55 PM IST

IPL 2024: ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు, గెలుపు జోష్‌లో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ సారథి కేఎల్‌ రాహుల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఈ ఇద్దరు కెప్టెన్లకు రూ.12 లక్షల మేర జరిమానా పడింది. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ కూడా నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయాయి.

MS DHONI: మాస్.. ఊర మాస్.. ధోనీ ధనాధన్ బ్యాటింగ్

కాగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ రూల్ అన్ని జట్లను వెంటాడుతోంది. రెండు సార్లు స్లో ఓవర్ రేట్ రూల్‌ను ఉల్లంఘిస్తే మూడోసారి జట్టు కెప్టెన్‌పై నిషేధం విధిస్తారు. ఈసారి ఐపీఎల్‌లో ఐదు జట్ల కెప్టెన్లు ఒక మ్యాచ్‌ నిషేధానికి అడుగు దూరంలో నిలిచారు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి స్లో ఓవర్ నిబంధనను పాటించనందుకు ఐదు జట్ల కెప్టెన్లు ఇప్పటికే మ్యాచ్ ఫీజు చెల్లించారు. ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘిస్తే.. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించాయి. దీంతో ఢిల్లీ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు బీసీసీఐ జరిమానా విధించింది. అయితే ఇప్పుడు ఈ ఐదుగురు కెప్టెన్లు మరోసారి ఇదే తప్పు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.