Lucknow Super Giants: అయోధ్యలో జాంటీ రోడ్స్.. రామ్‌లల్లాను దర్శించుకున్న లక్నో టీమ్

లక్నో తరఫున ఆడనున్న సౌతాఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్‌ కేశవ్‌ మహారాజ్‌తో పాటు స్టార్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌, హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 08:15 PM IST

Lucknow Super Giants: ఐపీఎల్‌ ఆరంభానికి ఒక్క రోజు ముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌ క్రికెటర్లు, కోచింగ్‌ సిబ్బంది గురువారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. లక్నో తరఫున ఆడనున్న సౌతాఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్‌ కేశవ్‌ మహారాజ్‌తో పాటు స్టార్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌, హెడ్‌కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్‌ తన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

CSK VS RCB: అదే జుట్టు.. అదే జోరు.. పాత ధోని పూనకాలు రిపీట్

చెన్నై చెపాక్‌‌ ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై అభిమానులను ఒక వార్త కలవరపెడుతోంది. కొన్ని మ్యాచ్‌లు ముగిసిన తరువాత ధోనీ విరామం తీసుకుంటాడని, స్వచ్ఛందంగా తుదిజట్టు నుంచి వైదొలగుతాడని, డగౌట్‌కే పరిమితం కావొచ్చంటూ వార్తలు వస్తోన్నాయి. దీనిపై ఎట్టకేలకు మౌనం వీడింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్. వాటిని తోసిపుచ్చింది. సీజన్ మొత్తానికీ ధోనీ అందుబాటులోనే ఉంటాడని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. తుదిజట్టులో ఉంటాడనీ అన్నారు. సీజన్ కొనసాగుతున్నప్పుడు అతన్ని పక్కన పెట్టాలనే ఉద్దేశం తమకు లేదనీ, విశ్రాంతీ తసుకోవాలని ధోనీ కూడా కోరుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా స్పష్టం చేశాడు. గత సీజన్ కంటే ధోనీ ఫిట్‌గా ఉన్నాడనీ అన్నాడు. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌తో మాట్లాడిన రాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధిస్తుందని తెలిపాడు. చెన్నైకి ఆడే ప్రతీ ఆటగాడిని ఆ ఫ్రాంచైజీ తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తోంది. మంచి వాతావరణంలో జట్టును ఉంచుతారు. ఆటగాళ్లందరినీ సమంగా చూస్తారు. వారి ఫ్యామిలీస్‌ను మంచిగా చూసుకుంటారు. గెలుపు, ఓటములతో జట్టు వాతావరణం మారదు. టీమ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందర్నీ సంతోషంగా ఉంచుతారు. ఆటగాళ్లు సంతోషంగా ఉంటారు కాబట్టి మంచి ప్రదర్శన చేస్తారు.’అని రాయుడు చెప్పుకొచ్చాడు.