నికోలస్ పూరన్, మార్కస్ స్టోఇనిస్, ఆయుష్ బధోని వంటి ప్లేయర్లు లక్నోకు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఎదురులేకుండా చేస్తున్నారు. ఇక బౌలింగ్ లో కుడి లక్నో జట్టు మంచి ఫామ్ లో ఉంది. ప్రధాన బౌలర్ మార్క్ వుడ్ సెన్సేషన్ స్పెల్స్ ఆల్రెడీ చూసే ఉన్నాం. రవి బిష్ణోయ్, సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా, కరుణాళ్ పాండ్యాలు కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతూ, పార్ట్నర్ షిప్స్ బిల్డ్ కాకుండా చేస్తున్నారు. లక్నో విషయంలో బ్యాటింగ్ తో బౌలింగ్ ను పోల్చుకుంటే అస్సలు మ్యాచ్ కాని ఈక్వేషన్ అది. బ్యాటింగ్ కి 90 మార్కులు ఇస్తే, బౌలింగ్ కు 60 కూడా ఇవ్వలేని పరిస్థితి, కాని, లక్నో వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ విజయాలు సాధించడంలో సక్సెస్ అవుతూ వస్తుంది. రేపు సొంత గ్రౌండ్ లో మరోసారి తన జూలు విదిల్చాలని సూపర్ జెయింట్స్ ఆరాటపడుతోంది. ఈరోజు రాత్రి మొదలయ్యే మ్యాచులో లక్నో నుంచి దాదాపుగా ఒక సెంచురీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు.