IPL, Mallika : ఐపీఎల్ వేలం వేయనున్న మహిళ ఎవరీ మల్లికా..

ఐపీఎల్ 2024 మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ఆరంభం కానుంది. ఇది మినీ వేలం కాబట్టి.. ఒకే రోజులో ముగుస్తుంది.

ఐపీఎల్ 2024 మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ఆరంభం కానుంది. ఇది మినీ వేలం కాబట్టి.. ఒకే రోజులో ముగుస్తుంది. భారత్ అవతల జరుగుతున్న తొలి వేలం కూడా ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024 వేలాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మొబైల్ లేదా టీవీలో ఈ వేలాన్ని ఉచితంగా చూడవచ్చు. ఐపీఎల్ 2024 వేలంను ఓ మహిళా ఆక్షనీర్‌ నిర్వహించనున్నారు. ఆమె పేరు మల్లికా సాగర్‌ అద్వానీ.

గత కొన్ని సీజన్లకు ఆక్షనీర్‌గా వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్ధానాన్ని మల్లికా భర్తీ చేయనున్నారు. తద్వారా ఐపీఎల్‌లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లికా నిలవనున్నారు. ఇటీవల ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంకు మల్లికా ఆక్షనీర్‌గా చేశారు. ప్రో కబడ్డీ లీగ్ వంటి ఇతర క్రీడల కోసం జరిగిన వేలంలో ఆమె భాగమయ్యారు. ప్రస్తుతం మల్లికా సాగర్‌ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఎవరీ మల్లికా సాగర్‌ అని క్రికెట్ ఫాన్స్ వెతుకున్నారు. మల్లికా సాగర్ ముంబైకి చెందిన ఓ ఆర్ట్‌ కలెక్టర్‌. 48 ఏళ్ల మల్లికాకు వేలంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో తన వాక్‌ చాతుర్యంతో అందరిని అకట్టుకున్నారు. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ కు సంబంధించిన వేలాన్ని మల్లికానే నిర్వహించారు. ఆపై ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలం, డబ్ల్యూపీఎల్ 2024 వేలం నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ 2024 వేలంను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.