Mohammed Shami: ఆట ఆడితే సరిపోదు. ఎంతో కమిట్‌మెంట్ కావాలి. పట్టుదల ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించాలన్న కసి ఉండాలి. ఇలాంటివి చాలా కొద్ది మంది ప్లేయర్స్‌లోనే చూస్తాం. అలాంటి జాబితాలో టీమిండియా సీనియర్ పేసర్ షమీ ఉంటాడు. తాజాగా షమీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన సంచలన విషయాలు బయటకు వచ్చాయి. వన్డే ప్రపంచకప్ 2023లో మహమ్మద్ షమీ ప్రతీ రోజు ఇంజెక్షన్ తీసుకొని ఆడాడని తెలుస్తోంది. షమీ సన్నిహితుడు అయిన ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఒక న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
VIRAT KOHLI: టెస్టుల్లో కోహ్లీకి కెప్టెన్సీ ఇవ్వండి.. బీసీసీఐకి మాజీ క్రికెటర్ సలహా
తీవ్ర నొప్పితోనే మహమ్మద్ షమీ ప్రపంచకప్ బరిలోకి దిగాడని, నొప్పిని భరిస్తూనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడని పేర్కొంది. చాలా రోజులుగా అతను ఎడమ చీలమండ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, చాలా మందికి ఈ విషయం తెలియదని షమీ సన్నిహితుడు చెప్పారు. ఇంజెక్షన్స్ సాయంతోనే బరిలోకి దిగిన షమీ టోర్నీ మొత్తం నొప్పిని భరించాడని వెల్లడించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ గాయాలు నయమవ్వాలంటే చాలా సమయం పడుతోందని చెప్పుకొచ్చాడు. కాగా షమీ కమిట్‌మెంట్‌పై మాజీలు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎదుర్కొని, అద్భుతంగా పుంజుకున్న షమీ అంతకుమించి అంకితభావంతో దేశం కోసం చక్కగా ఆడాడని అభినందస్తున్నారు. టోర్నీ ఆరంభం నుంచీ అదరగొట్టిన షమీ 24 వికెట్లతో వరల్డ్‌కప్ చరిత్రలో ఒక ఎడిషన్‌కు సంబంధించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ఇదిలా ఉంటే గాయం కారణంగా ఇటీవల సౌతాఫ్రికా పర్యటనకు అతను దూరమయ్యాడు. అయితే సఫఆరీ పర్యటనలో మహమ్మద్ షమీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో మూడో పేసర్‌గా బరిలోకి దిగిన ప్రసిధ్ కృష్ణ తేలిపోయాడు. ఇక షమీ స్థానంలో ఆవేశ్ ఖాన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. షమీ పూర్తిస్థాయిలో కోలుకునేందుకు మరికొంత సమయం పడుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి.