Mohammed Siraj: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా మరికొన్ని రోజుల్లో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూలై 12న తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే ప్రాక్టీస్‌లో భాగంగా సిరాజ్ చేసిన ఒక పని ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మహమ్మద్ సిరాజ్ ఎంత కష్టపడి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కటిక పేదరికం నుంచి వచ్చిన ఈ తెలుగు కుర్రాడు ప్రపంచ వన్డే క్రికెట్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా మారడం అంటే మాములు కాదు.
సిరాజ్ ఎంత కష్టపడి పైకి వచ్చాడో గ్రౌండ్‌లో అతని అగ్రెసివ్‌నెస్ చూస్తే తెలిసిపోతుంది. పదునైన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టగల ప్రమాదకర బౌలర్‌గా మారాడు. అన్ని ఫార్మాట్‌లలో రాణిస్తూ టీమిండియాలో కీలక బౌలర్‌గా ఎదిగాడు. ఎంత కష్టపడి పైకొచ్చినా సిరాజ్ మాత్రం తన విలువలను మాత్రం మార్చిపోలేదు. తన కష్టం వేరొకరి రాకూడదని కష్టాల్లో ఉన్న క్రికెటర్లకు సహాయం చేసాడు. డొమినిక్ వేదికగా 12 నుంచి జరగనున్న తొలి టెస్టు కోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేశాయి.
ఈ క్రమంలో సిరాజ్ తన దగ్గర ఉన్నటువంటి బ్యాట్, షూస్‌ని బార్బడోస్ క్రికెటర్లకు ఇచ్చేసాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు క్రికెటర్లందరూ జాతీయ జట్టుకి కాకుండా ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడుకుంటున్నారు. ఈ సమయంలో విండీస్ కుర్రాళ్లకు షూస్, బ్యాట్ ఇవ్వడం సిరాజ్‌ని మరో స్థాయిలో నిలబెట్టడం గ్యారంటీ.