ఇదేమి బౌలింగ్..! పాండ్యాపై మోర్కెల్ అసంతృప్తి

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్న పాండ్యాకు ఈ సిరీస్ కీలకమే.

  • Written By:
  • Updated On - October 4, 2024 / 08:12 PM IST

టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ తో మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రెండు నెలల పాటు రెస్ట్ తీసుకున్న పాండ్యాకు ఈ సిరీస్ కీలకమే. ఎందుకంటే ఆల్ రౌండర్ కోటాలో శివమ్ దూబేతో పాటు నితీశ్ కుమార్ రెడ్డి నుంచి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో బౌలింగ్ పై మరింత ఫోకస్ పెట్టి నెట్స్ లో చెమటోడుస్తున్నాడు. అయితే పాండ్యా బౌలింగ్ పై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. చాలా సేపు హార్థిక్ బౌలింగ్ ను పర్యవేక్షించిన మోర్కెల్ దీనిపై అతనితో సుదీర్ఘంగా చర్చించాడని తెలుస్తోంది. బౌలింగ్ శైలిలో కాస్త మార్పు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

హార్దిక్ పాండ్యా స్టంప్స్‌కు దగ్గరగా వెళ్లి బంతులు వేస్తున్నాడని గుర్తించిన మోర్కెల్.. పలు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల టీ ట్వంటీ ప్రపంచకప్ లోనూ పాండ్యా ఆకట్టుకున్నాడు. ఫైనల్లో చివరి ఓవర్ ను అద్భుతంగా వేసి జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. అయితే ప్రస్తుతం జట్టులో ఉన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందేనని పాండ్యాకు అర్థమైపోయింది. కాగా ఇప్పటి వరకూ 102 టీ ట్వంటీలు ఆడిన హార్థిక్ 1523 పరుగులతో పాటు 86 వికెట్లు తీశాడు.