MS Dhoni: ధోనీ కొత్త రోల్ ఇదేనా..? ఐపీఎల్‌లో ధోనీ పాత్రేంటి..?

ధోనీ.. సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటార్‌గా కొనసాగుతాడా అనే చర్చ జోరుగా సాగింది. ధోనీ ఈ సీజన్‌ ఆడడేమోనని అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ ధోనీ తన కొత్త పాత్ర ఏంటో తెలియజేస్తూ అందరికి షాకిచ్చాడు.

  • Written By:
  • Publish Date - March 6, 2024 / 08:14 PM IST

MS Dhoni: “కొత్త సీజన్.. కొత్త పాత్ర కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే అప్‌డేట్ ఇస్తాను” అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమయింది. ఈ పోస్ట్‌తో అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ధోనీ.. సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని మెంటార్‌గా కొనసాగుతాడా అనే చర్చ జోరుగా సాగింది. ధోనీ ఈ సీజన్‌ ఆడడేమోనని అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

IND VS ENG: చివరి టెస్టుకు ఎక్స్‌ట్రా పేసర్.. టీమ్ కాంబినేషన్‌పై రోహిత్ కామెంట్స్

కానీ ధోనీ తన కొత్త పాత్ర ఏంటో తెలియజేస్తూ అందరికి షాకిచ్చాడు. చాలా మంది ఊహించినట్లుగానే ధోనీ ఓ యాడ్ కోసం ఈ పోస్ట్ పెట్టినట్లు స్పష్టమైంది. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియోసినిమా రూపొందించిన యాడ్‌‌లో ధోనీ కొత్త పాత్రలో కనిపించాడు. ఈ ఐపీఎల్ ప్రకటనలో ధోనీ వృద్ధుడి పాత్ర పోషించాడు. ఈ ప్రకటనలో తెల్లని వెంట్రుకలతో పాటు మీసాలతో మొబైల్‌లో జియోసినిమా ద్వారా క్రికెట్ చూస్తున్న ముసలి ధోనీకి గుండెపోటు వస్తోంది. అతన్ని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రిలోకి తరలించే ప్రయత్నం చేయగా.. ముసలి ధోనీ నొప్పితోనే క్రికెట్ చూస్తుంటాడు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనీ చెప్పిన కొత్త పాత్ర ఇదేనేమోనని కామెంట్ చేస్తున్నారు. ధోనీ మాత్రం ఈ వీడియోపై స్పందించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం ధోనీ సిద్దమవుతున్నాడు.