MS DHONI: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. దటీజ్ ధనాధన్ ధోనీ

ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్రసింగ్ ధోని తుఫాన్ బ్యాటింగ్‌తో శివాలెత్తిపోయాడు. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సులు బాది టీమ్ స్కోర్‌ను 200 దాటించాడు ధోని. ఓవరాల‌్‌గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.

  • Written By:
  • Publish Date - April 15, 2024 / 05:54 PM IST

MS DHONI: మనం అభిమానించే టీమ్ వికెట్ పడిపోవాలని ఎప్పుడైనా అనుకుంటామా.. బాగా ఆడే ప్లేయర్ ఔట్ అవ్వాలని కోరుకుంటామా.. ఇవన్నీ ముంబైతో చెన్నై బ్యాటింగ్ సందర్భంగా జరిగాయి. ఎప్పుడు వికెట్ పడుతుందా.. ధోని ఎప్పుడు బ్యాటింగ్‌కి వస్తాడా అని అంతా ఎదురుచూశారు. ఒక్క మాటలో చెప్పాలంటే చెన్నై వికెట్ కోల్పోవాలని బలంగా కోరుకున్నారు.

Shivam Dube: వరల్డ్ కప్ జట్టులో చెన్నై హిట్టర్..? చోటు ఖాయం అంటున్న ఎక్స్‌పర్ట్స్

వారి కోరిక నెరవేరుస్తూ మిచెల్ ఔట్ అయ్యాడు. దీంతో ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్రసింగ్ ధోని తుఫాన్ బ్యాటింగ్‌తో శివాలెత్తిపోయాడు. పాండ్యా వేసిన ఈ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సులు బాది టీమ్ స్కోర్‌ను 200 దాటించాడు ధోని. ఈ క్రమంలోనే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎదుర్కొన్న తొలి మూడు బాల్స్‌ను సిక్సర్లుగా బాదిన మెుట్టమెుదటి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఓవరాల‌్‌గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో సునీల్ నరైన్, నికోలస్ పూరన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

పాండ్యా వేసిన చివరి ఓవర్ మ్యాచ్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఈ ఓవర్‌లో ధోని దెబ్బకు ఏకంగా 26 పరుగులు వచ్చాయి. ఇక మిస్టర్ కూల్ నుంచి ఇలాంటి సునామీ ఇన్నింగ్స్‌ను చాలా కాలం తర్వాత చూసిన ఫ్యాన్స్ ఎంతోషంతో గంతులేస్తున్నారు.