MS DHONI: మాస్.. ఊర మాస్.. ధోనీ ధనాధన్ బ్యాటింగ్

సహచర ఆటగాళ్లంతా 150 స్ట్రైక్‌రేటు సాధించడానికి చెమటోడుస్తుంటే ధోనీ మాత్రం సునాయాసంగా 300కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేశాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ ఆది నుంచే బ్యాటు ఝుళిపించాడు.

  • Written By:
  • Publish Date - April 20, 2024 / 02:41 PM IST

MS DHONI: ఐపీఎల్ 17వ సీజన్ లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహేంద్ర సింగ్ ధోని మరోసారి అదరగొట్టాడు. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని మెరుపులు మెరిపించాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన మిస్టర్‌ కూల్‌.. లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వయసు మీద పడుతున్నా తన ఆటలో ఏ మాత్రం పదును తగ్గలేదని ధోనీ మరోసారి నిరూపించాడు.

YS VIJAYAMMA: అమెరికా నుంచి విజయమ్మ సందేశం.. ఎమోషనల్ అయిన షర్మిల..

సహచర ఆటగాళ్లంతా 150 స్ట్రైక్‌రేటు సాధించడానికి చెమటోడుస్తుంటే ధోనీ మాత్రం సునాయాసంగా 300కు పైగా స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేశాడు. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ ఆది నుంచే బ్యాటు ఝుళిపించాడు. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదాడు. యశ్ ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఓ సిక్సర్, రెండు బౌండరీలు సాధించాడు. తొమ్మిది బంతుల్లో అజేయంగా 29 పరుగులు సాధించాడు. ఠాకూర్ బౌలింగ్‌లో ధోనీ తన ట్రేడ్ మార్క్‌ షాట్‌తో సిక్సర్ బాదాడు. 42 ఏళ్ల వయస్సులోనూ ధోని తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అభిమానులను అలరించాడు. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధోనీ మెరుపులతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 57 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ధోని 28, మొయిన్‌ అలీ 30 పరుగులతో రాణించారు. క్రమంలో ధోనీ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అయిదు వేల పరుగుల మైలురాయి పూర్తి చేసుకున్నాడు.

తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ సీజన్‌లో ధోనీ మినహా ఏ వికెట్ కీపర్ ఈ ఫీట్‌ను సాధించలేకపోయాడు. ఓవరాల్‌గా ఈ మార్క్‌ను అందుకున్న అయిదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అత్యధిక పరుగుల చేసిన జాబితాలో ధోనీ కంటే ముందు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ధోనీ ఒక్కసారి కూడా ఔట్ కాలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌లల్లోనూ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి నాటౌట్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా 34 బంతుల్లో 87 పరుగులు చేశాడు. ధోనీకి ఇదే చివరి సీజన్ కానుందన్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ అతని బ్యాటింగ్‌ను చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు.