MS DHONI: భారత క్రికెట్‌లో మహేంద్రసింగ్ ధోనీది ప్రత్యేకమైన స్థానం. దేశానికి రెండు ప్రపంచకప్ లు అందించిన మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. ధోనీ కూల్ కెప్టెన్సీకి ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు సైతం ఫిదా అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక ధోనీ హెయిర్ స్టైల్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీమిండియాలోకి వచ్చిన కొత్తలో పొడవాటి జుట్టుతో మహి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
TSPSC: గ్రూప్ 2 పరీక్ష మూడోసారి వాయిదా.. మళ్లీ ఈసారి ఎగ్జామ్ ఎప్పుడంటే..
అప్పటి పాక్ ప్రెసిడెంట్ ముషారఫ్ సైతం ధోనీ లాంగ్ హెయిర్ స్టైల్ కు పెద్ద ఫ్యాన్. తర్వాతి క్రమంలో ధోనీ హెయిల్ స్టైల్ మార్చేశాడు. ఇప్పుడు మళ్లీ పొడవాటి జుట్టుతో కనిపిస్తున్నాడు. మునుపటిలా బాగా పొడవుగా కాకున్నా స్టైలిష్ లుక్ తో దర్శనమిస్తున్నాడు మహి. ఇదంతా యాడ్స్ షూటింగ్స్ కోసమే పెంచానని తాజాగా ధోనీ వెల్లడించాడు. ఈ లాంగ్ హెయిర్ తో ఇబ్బంది పడుతున్నానని, మేకప్ సమయంలో టైమ్ ఎక్కువ పడుతోందని ధోనీ చెప్పుకొచ్చాడు. యాడ్స్ షూటింగ్ ముగిసినప్పటకీ కట్ చేయడం లేదని, తన పొడవాటి హెయిర్ స్టైల్ ను ఇష్టపడే ఫ్యాన్స్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఏదో ఒకరోజు కట్ చేస్తానని, ప్రస్తుతానికి ఫ్యాన్స్ కోసమే కంటిన్యూ చేస్తున్నానంటూ అభిమానులంటే తనకెంత ప్రేమో చెప్పకనే చెప్పాడు.
కాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడుస్తున్నా ఐపీఎల్‌లో ట్రోఫీ వేటలో ఇప్పటికీ ధోనీనే ముందున్నాడు. 2023 సీజన్‌లో చెన్నైను మరోసారి విజేతగా నిలిపాడు. 42 ఏళ్ల ధోనీ ఈ ఏడాది మోకాలికి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. వచ్చే సీజన్ లోనూ అభిమానులను అలరించేందుకు మహి రెడీ అవుతున్నాడు. ధోనీకి 17వ ఐపీఎల్ సీజన్ చివరిది కావొచ్చన్న వార్తల నేపథ్యంలో అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.