MS DHONI: సైన్యంలోకి ధోని.. అప్పుడే చెప్పాడు..

అంతర్జాతీయ క్రికెట్‌కు మూడేళ్ల కిందట ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ధోనీకి వచ్చే ఐపీఎల్‌ సీజనే చివరిదని అంతా భావిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 07:38 PM IST

MS DHONI: ఆట నుంచి వీడ్కోలు పలికిన క్రికెటర్లను ‘మీ తర్వాత ప్లానింగ్‌ ఏంటి?’ అని అడిగితే.. మేం వ్యాఖ్యాతలుగా మారుతాం లేదా క్రికెట్ అకాడమీలు పెడతాం లేదా కోచింగ్‌ వ్యవహారాలపై ఆసక్తి చూపిస్తామనే మాటలు వినిపిస్తుంటాయి. అదే టీమ్‌ ఇండియా ‘కెప్టెన్‌ కూల్‌’ ఎంఎస్ ధోనీని ఇదే మాట అడిగినప్పుడు అతడు చెప్పిన సమాధానం విని, క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు మూడేళ్ల కిందట ధోనీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

JD Laxminarayana New Party: జై భారత్ పేరుతో కొత్త పార్టీ పెట్టిన జేడీ లక్ష్మినారాయణ

ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ధోనీకి వచ్చే ఐపీఎల్‌ సీజనే చివరిదని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో ధోనీకి ఎదురైన ప్రశ్నకు అతడు స్పందించిన తీరు ఆకట్టుకుంది. “క్రికెట్‌ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే నాకూ ఆసక్తికరంగానే ఉంది. అయితే, ఆర్మీలో మరింత సమయం గడపాలని ఉంది. గత కొన్నేళ్లుగా నేను ఎక్కువ సమయం వెచ్చించలేదు. ఆ లోటును పూరించాల్సిన బాధ్యత నాపై ఉంది” అని ధోనీ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్‌కు అందించిన సేవలకుగానూ ఎంఎస్ ధోనీకి 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ర్యాంక్‌ను అందించారు.

2015లో ట్రైనింగ్‌ క్యాంప్‌లోనూ పాల్గొన్నాడు. 2019లో జమ్మూ కశ్మీర్‌లో విధులు కూడా నిర్వర్తించాడు. చిన్నప్పటి నుంచి తనకు సైనికుడు కావాలని ఉండేదని పలు సందర్భాల్లో ధోనీ వెల్లడించాడు. ‘‘ఆర్మీ సిబ్బందిని చూస్తున్నప్పుడల్లా.. నేను కూడా పెద్దయ్యాక సైన్యంలో చేరతానని చిన్నప్పుడే అనుకొనేవాడిని’’ అని ధోనీ తెలిపాడు.