MS DHONI JERSEY: ధోని జెర్సీ నెంబర్‌7పై బీసీసీఐ సంచలనం.. ఆ నెంబర్‌‌కు ఇక రిటైర్మెంట్..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి BCCI అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వేసుకున్న నంబర్ 7జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్ క్రికెట్‌లో అంతర్జాతీయ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి జెర్సీ నెంబర్ 10 ఉండేది.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 05:37 PM IST

MS DHONI JERSEY: క్రికెట్ గ్రౌండ్‌లో నెంబర్ 7 వేసుకున్న జెర్సీ కోసం ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ అభిమానులు తెగ వెతికేవారు. ఆ జెర్సీ వేసుకున్న ధోనీ గ్రౌండ్‌లో ఉన్నాడంటే చాలు అదో భరోసా. ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే విజయం టీమిండియాదే అని ధీమాగా ఉండేవారు. ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్‌గా ఆడుతూ జట్టుకు విజయం తెచ్చిపెట్టేవాడు ధోనీ. అప్పటికీ.. ఇప్పటికీ ధోనీకి ఆ క్రేజ్ మాత్రం తగ్గలేదు. అంతర్జాతీయ మ్యాచుల నుంచి రిటైర్ అయినా IPLలో రాణిస్తూ క్రికెట్ ప్రేమికులను అలరిస్తూనే ఉన్నాడు ధోనీ.

SAMSUNG PHONE: మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా..? బిగ్ అలెర్ట్.. కేంద్రం ఏం చెప్పిందంటే..!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి BCCI అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వేసుకున్న నంబర్ 7జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్ క్రికెట్‌లో అంతర్జాతీయ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి జెర్సీ నెంబర్ 10 ఉండేది. జెర్సీ నెంబర్ 10 అనగానే సచిన్ గుర్తుకొచ్చేవాడు. సచిన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాక.. ఆయనకు గౌరవసూచకంగా 10 నెంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించింది BCCI. సరిగ్గా ఇప్పుడు ధోనీకి కూడా అలాంటి గౌరవమే ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న భారత జట్టు క్రికెటర్స్ ఎవరూ కూడా నెంబర్ 7ను సెలక్ట్ చేసుకోవద్దని చెప్పింది BCCI. దాంతో ధోనీ ఉపయోగించిన నెంబర్ 7 జెర్సీ కూడా రిటైర్ అయినట్టే. సచిన్‌కి 10 లాగే ధోనీ జెర్సి 7కి కూడా రిటైర్మెంట్ ప్రకటించి గౌరవం ఇవ్వాలని గతంలో మాజీ క్రికెటర్లు BCCIకి విజ్ఞప్తి చేశారు. ధోనీ అభిమానులు కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసింది BCCI.

భారత్ క్రికెట్‌కు ధోనీ చేసి సేవలకు ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. కాబట్టి, ఇకముందు నెంబర్ 10 అండ్ నెంబర్ 7 జెర్సీలు ఏ ఇండియన్ క్రికెటర్‌కీ ఇవ్వరు. ICC నిబంధనల ప్రకారం ఏ దేశానికి చెందిన ఆటగాడు అయినా ఒకటి నుంచి 100లోపు తమ జెర్సీకి ఏ నెంబర్ అయినా ఎంచుకునే అవకాశముంది. కానీ ఇండియాలో మాత్రం 7, 10 తప్ప మిగతా వాటిల్లో ఏవైనా సెలక్ట్ చేసుకోవచ్చు. 2017లో సచిన్ రిటైర్డ్ అయినప్పుడు నెంబర్ 10 జెర్సీ వేసుకొని శార్దుల్ ఠాకూర్ ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. దాంతో ఆయన్ని సచిన్ అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ టైమ్‌లో BCCI కలుగజేసుకొని అతనికి 54వ నెంబర్ కేటాయించింది. సచిన్ నెంబర్ 10, ధోనీ 7 ఎలాగో విరాట్ కోహ్లీకి 18వ నెంబర్, రోహిత్ శర్మ 45వ నంబర్ జెర్సీలు కూడా అంతే ఫేమస్. కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ రెండు నెంబర్లు కూడా BCCI ఎవరికీ కేటాయించకపోవచ్చు.