ROHIT SHARMA: రోహిత్‌ను అందుకే తప్పించాం.. ముంబై కోచ్ కామెంట్స్‌పై రితిక ఫైర్

రోహిత్ శర్మను తప్పించడం వెనుక కారణాన్ని ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయేమని, వ్యక్తిగత నిర్ణయాలు కాదన్నాడు. అయితే రోహిత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని భావోద్వేగంతో ఆలోచిస్తున్నారని బౌచర్ వ్యాఖ్యానించాడు.

  • Written By:
  • Updated On - February 6, 2024 / 03:58 PM IST

ROHIT SHARMA: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై ఇండియన్స్‌కు ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందించాడు. అయితే రానున్న 17వ సీజన్‌కు ముందు రోహిత్‌ను సారథిగా తప్పించిన ముంబై మేనేజ్‌మెంట్ హార్ధిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ నిర్ణయంపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ యాజమాన్య నిర్ణయాన్ని తప్పుపడుతూ పరోక్షంగా సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

VIJAY DEVARAKONDA: మెగాస్టార్ చిరంజీవి మూవీలో రౌడీ స్టార్

అయినప్పటికీ ముంబై మేనేజ్‌మెంట్ హార్ధిక్ వైపే మొగ్గుచూపింది. తాజాగా రోహిత్ శర్మను తప్పించడం వెనుక కారణాన్ని ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇది క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయేమని, వ్యక్తిగత నిర్ణయాలు కాదన్నాడు. అయితే రోహిత్ అభిమానులు ఈ నిర్ణయాన్ని భావోద్వేగంతో ఆలోచిస్తున్నారని బౌచర్ వ్యాఖ్యానించాడు. రోహిత్ అసాధరణ ప్లేయర్ అన్న బౌచర్.. మరోసారి హిట్ మ్యాన్‌లో అత్యుత్తమ ప్లేయర్‌ను అభిమానులు చూస్తారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానిపై రోహిత్ భార్య రితిక స్పందించారు. ఈ నిర్ణయంలో చాలా తప్పులున్నాయంటూ ఆమె చేసిన కామెంట్ వైరల్‌గా మారింది.

రోహిత్‌ను సారథిగా తప్పించడంపై రితిక కూడా ఆగ్రహంతోనే ఉన్నట్టు అర్థవుతోందని ఫ్యాన్స్ అంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఉద్దేశపూర్వకంగానే ఫ్రాంచైజీ వేటు వేసిందని కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు ముంబై కెప్టెన్సీ మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.