ఐపీఎల్ మెగా వేలం ఈ ఓపెనర్లే ముంబై టార్గెట్

ఐపీఎల్ 18వ సీజన్ కోసం అన్ని టీమ్స్ రూపురేఖలు మారిపోబోతోనున్నాయి. ఏడాది చివర్లో జరగనున్న మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. గత సీజన్ ముంబై ఇండియన్స్ గా పీడకలగా మిగిలింది.

  • Written By:
  • Publish Date - September 10, 2024 / 03:50 PM IST

ఐపీఎల్ 18వ సీజన్ కోసం అన్ని టీమ్స్ రూపురేఖలు మారిపోబోతోనున్నాయి. ఏడాది చివర్లో జరగనున్న మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. గత సీజన్ ముంబై ఇండియన్స్ గా పీడకలగా మిగిలింది. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ గా పేరున్న ముంబై ఎన్నడూ లేని విధంగా చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో ఈ సారి జట్టు కూర్పుపై పూర్తిస్థాయిలో ముంబై యాజమాన్యం దృష్టి పెట్టింది. పలువురు స్టార్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేయడం ఖాయమైంది. అదే సమయంలో కొత్తగా యువ ఓపెనర్లపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. రోహిత్ శర్మ ముంబైకి గుడ్ బై చెబుతాడన్న వార్తల నేపథ్యంలో ముంబై ఓపెనింగ్ కాంబినేషన్ ను స్ట్రాంగ్ చేయాలని డిసైడయింది.

దీని కోసం రోహిత్ స్థానంలో ధాటిగా ఆడే ఓపెనర్లపై కన్నేసింది. వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ కోసం ముంబై ప్రయత్నించే ఛాన్సుంది. గత సీజన్ లో అభిషేక్ 204 స్ట్రైక్ రేట్ తో 484 పరుగులతో అదరగొట్టాడు. ట్రేడింగ్ ద్వారా ఈ యువ ఓపెనర్ ను తీసుకోవాలని అనుకుంటోంది. అలాగే లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్ వేలంలోకి రావడం ఖాయమని వార్తలు వినిపిస్తుండడంతో అతని కోసం బిడ్ వేసే ఛాన్సుంది. హార్థిక్ పాండ్యాకు రాహుల్ తో మంచి రిలేషన్ ఉండడంతో అతన్ని తీసుకునే అవకాశాలున్నాయి. ఇక కోల్ కతాకు ఆడుతున్న ఫిల్ సాల్ట్ పై కూడా ముంబై కన్నేసినట్టు సమాచారం. గత సీజన్ లో 182 స్ట్రైక్ రేట్ తో 435 రన్స్ చేసిన సాల్ట్ ను కూడా ముంబై వేలంలో తీసుకునే ఛాన్సుంది.