Mumbai Indians : గెలుపు ముంగిట ముంబై బోల్తా.. ఫైనల్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

గెలుపు వాకిట ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) బోల్తా పడింది. అనూహ్యంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) 5 పరుగుల తేడాతో గెలిచి ముంబైకి షాక్ ఇచ్చింది.

గెలుపు వాకిట ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) బోల్తా పడింది. అనూహ్యంగా ఉత్కంఠ రేపిన ఆఖరి ఓవర్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) 5 పరుగుల తేడాతో గెలిచి ముంబైకి షాక్ ఇచ్చింది. తద్వారా మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌లో స్మృతి మంధాన నాయకత్వంలోని బెంగళూరు జట్టు ఫైనల్‌ చేరింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎలిమినేట్‌ అయ్యింది. ముందుగా బెంగళూరు (Bangalore) 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. చివరి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా 19వ ఓవర్‌ వేసిన సోఫీ మోలినెక్స్‌ నాలుగే పరుగులిచ్చి సజన వికెట్‌ తీసింది.

ఇక చివరి ఓవర్లో లెగ్‌ స్పిన్నర్‌ ఆశ శోభన మ్యాజిక్ చేసింది. తొలి 3 బంతులకు 4 పరుగులే ఇచ్చింది. ఆశ వేసిన నాలుగో బంతికి పూజ వస్త్రకర్‌ స్టంపౌట్‌ అయ్యింది. ఆశ వేసిన ఆఖరి బంతికి ఒక్క పరుగు మాత్రమే రావడంతో ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో బెంగళూరు 5 పరుగులతో గెలిచి తొలిసారి డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో బెంగళూరు తలపడుతుంది.