Naga Chaitanya: హైదరాబాద్ రేసింగ్ ఫ్రాంచైజీ యువసామ్రాట్ చేతికి..!

తెలుగు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య.. మోటార్‌ రేసింగ్‌ జట్టుకు యజమానిగా మారాడు. రేసింగ్‌ టీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ను అతను సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌లో బ్లాక్‌బర్డ్స్‌ పోటీపడ్డ సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - September 15, 2023 / 06:39 PM IST

Naga Chaitanya: ఫార్ములా వన్‌ రేసులు, సూపర్‌ కార్లు, మోటార్‌ సైకిళ్లను ఇష్టపడే తెలుగు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య.. మోటార్‌ రేసింగ్‌ జట్టుకు యజమానిగా మారాడు. రేసింగ్‌ టీమ్‌ హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ను అతను సొంతం చేసుకున్నాడు. ‘‘మోటార్‌స్పోర్ట్స్‌లో భాగం కావాలని ఎప్పటి నుంచో చూస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ను సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో ఈ జట్టు అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది’’ అని నాగచైతన్య తెలిపాడు.

గత ఏడాది ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ ఆరంభ సీజన్‌లో బ్లాక్‌బర్డ్స్‌ పోటీపడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోనూ ఈ రేసులు జరిగాయి. గతేడాది ఈ లీగ్‌లో బ్లాక్‌బర్డ్స్‌ రేసర్లు అఖిల్‌ రవీంద్ర, నీల్‌ జాని వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బ్లాక్‌బర్డ్స్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది ఫార్ములా-4 ఇండియన్‌ ఛాంపియన్‌షిప్‌ ఆరంభ సీజన్‌లో బరిలో దిగేందుకు బ్లాక్‌బర్డ్స్‌ సిద్ధమవుతోంది. అక్కినేని నాగచైతన్య రేసింగ్ టీమ్‌ను సొంతం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.