Shakib Al Hasan: మాథ్యూస్ టైమ్డ్ ఔట్.. అసలు కారకుడు షకీబ్ కాదా..

శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నడూ చూడని టైమ్‌డ్ ఔట్ పద్దతిలో ఔటవ్వడం.. కొద్దిసేపటి తరువాత ఇరు జట్ల కోచ్‌ల మధ్య వాడి వేడి చర్చ.. మ్యాచ్ ముగిశాక లంక ఆటగాళ్లు బంగ్లా క్రికెటర్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు జరిగాయి.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 06:43 PM IST

Shakib Al Hasan: రెండ్రోజుల క్రితం ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ వేదికగా జరిగిన శ్రీలంక (sri lanka) వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (Bangladesh) మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని పక్కనపెడితే, చోటుచేసుకున్న వివాదాలు మాత్రం అనేకం. శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ (Angelo Mathews) అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నడూ చూడని టైమ్‌డ్ ఔట్ పద్దతిలో ఔటవ్వడం.. కొద్దిసేపటి తరువాత ఇరు జట్ల కోచ్‌ల మధ్య వాడి వేడి చర్చ.. మ్యాచ్ ముగిశాక లంక ఆటగాళ్లు బంగ్లా క్రికెటర్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు జరిగాయి.

Glenn Maxwell: మ్యాక్సీ.. నువ్‌ మనిషివేనా.. ఆఫ్గన్‌పై రికార్డ్ డబుల్ సెంచరీ..!

ఈ మ్యాచ్ వివాదాస్పదం అవ్వడానికి మూలకారణం.. మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్ నిర్ణయం. అతడు సరైన సమయానికి క్రీజులోకి వచ్చినా.. హెల్మెట్‌లో సమస్య కారణంగా రెండు నిమిషాల్లోపు బంతిని పేస్ చెయ్యలేకపోయాడు. ఫలితంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల హసన్ (Shakib Al Hasan) దానిపై అప్పీల్ చేయడం.. అంపైర్లు ఔట్ ఇవ్వడం జరిగిపోయాయి. మ్యాచ్ ముగిశాక పోస్ట్ ప్రెసెంటేషన్‌లో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. బంగ్లా ఫీల్డర్లలో ఒకరు తన వద్దకు వచ్చి ఇప్పుడు అప్పీల్ చేస్తే నిబంధనల ప్రకారం మాథ్యూస్ ఔట్ అవుతారని చెప్పాడని వెల్లడించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో షకీబ్.. అతని పేరు బయటకి చెప్పలేదు. అయితే అతనెవరో కాదని.. నజముల్ హుస్సేన్ శాంటో అని నెటిజెన్స్ చెప్తున్నారు. ఈ ఘటన జరిగడానికి కొన్ని సెకన్ల ముందు షకీబ్, నజ్ముల్ హుస్సేన్ షాంటో (Najmul Hossain Shanto) మాట్లాడుకున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై శాంటో వివరణ ఇస్తారేమో వేచిచూడాలి.