వారిద్దరూ పెళ్ళి చేసుకోబొతున్నారా ? నీరజ్, మను బాకర్ పై రూమర్స్

  • Written By:
  • Publish Date - August 12, 2024 / 03:30 PM IST

పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన షూటర్ మను బాకర్, జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రాకు సంబంధించిన వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోలో మనుభాకర్, నీరజ్ చోప్రా చాలా క్లోజ్ గా ఉండటంతో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తామిద్దరని ఫోటో తీస్తున్న తన తల్లి సుమేధను మను భాకర్ వద్దని చెప్పడం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ఫ్రెండ్సా… లేక లవర్సా అన్న వార్తలు వస్తున్నాయి. తర్వాత నీరజ్ చోప్రాతో ప్రత్యేకంగా మాట్లాడిన సుమేధ.. అతనితో తలపై ఒట్టు వేయించుకున్నారు. అయితే ఈ ఇద్దరినీ ఫోటో తీస్తుంటే మనుభాకర్ ఎందుకు వద్దన్నారు.. నీరజ్ చోప్రాతో సుమేధ ఏం మాట్లాడారు అన్నది తెలియరాలేదు. ఈ వీడియో చూస్తుంటే.. మనుభాకర్, నీరజ్ చోప్రాకు ఇంతకుముందే పరిచయం ఉన్నట్లు అర్థమవుతోంది.

నెట్టింట ఈ వీడియా వైరల్ గా మారడంతో చాలా మంది వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉన్నట్టుందని భావిస్తున్నారు. కొందరైతే పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ వీరిద్దరూ కలిసి కనిపించలేదు. నీరజ్ టోక్యో ఒలింపిక్స్ గెలిచిన తర్వాత కూడా అతని పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఆసక్తికర వార్తలు కూడా ఏం రాలేదు. అయితే ప్రస్తుత ఒలింపిక్స్ సందర్భంగా మను బాకర్ తో అతను క్లోజ్ మూవ్ అయిన విధానం చూసి చాలా మంది వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై అటు నీరజ్ గానీ, ఇటు మను బాకర్ కానీ స్పందించలేదు. ఇదిలా ఉంటే పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ రెండు మెడల్స్ గెలిచిన భారత అథ్లెట్ గా చరిత్ర సృష్టిస్తే… నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్స్ లోనూ మెడల్ గెలిచి రికార్డులకెక్కాడు.