NEPAL TEAM: నేపాల్.. ది బెస్ట్.. మరో న్యూజిలాండ్ కానుందా..?

పసికూన నేపాల్‌పై టీమిండియా కష్టపడే గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన నేపాల్.. ఆ తర్వాత బౌలింగ్‌తోనూ ఇబ్బంది పెట్టింది. కానీ భారత ఓపెనర్లు ఓపికగా ఆడి విజయాన్నందించారు.

  • Written By:
  • Publish Date - September 5, 2023 / 03:23 PM IST

NEPAL TEAM: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో సోమవారం జరిగిన వన్డేలో నేపాల్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓడినా నేపాల్ అద్భుత పోరాటం కనబర్చింది. మరో 30 పరుగులు అదనంగా చేసుంటే టీమిండియాను ఓడించేవాళ్లమని నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ తెలిపాడు.

‘మా ఓపెనర్లు అసాధారణమైన ప్రదర్శన కనబర్చారు. మిడిలార్డర్ ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది. మా లక్ష్యాన్నికి మేం 30 పరుగులు తక్కువగా చేశాం. మిడిలార్డర్ సత్తా చాటి ఉంటే 260-270 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందు ఉంచేవాళ్లం’ అని నేపాల్ నాయకుడు రోహిత్ పౌడెల్ అన్నాడు. బౌలింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లోనూ మా బౌలర్లు అద్భుతంగా పోరాడారు. వర్షం కారణంగా బంతి అస్సలు పట్టు చిక్కలేదు. అయితే భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.’అని రోహిత్ పౌడెల్ చెప్పుకొచ్చాడు.
పసికూన నేపాల్‌పై టీమిండియా కష్టపడే గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌లో సత్తా చాటిన నేపాల్.. ఆ తర్వాత బౌలింగ్‌తోనూ ఇబ్బంది పెట్టింది. కానీ భారత ఓపెనర్లు ఓపికగా ఆడి విజయాన్నందించారు. అన్ని విభాగాల్లో అదరగొట్టిన నేపాల్ జట్టు పోరాట పటిమను గమనించిన నెటిజన్లు, నేపాల్ మరో న్యూజిలాండ్ జట్టుగా ఎదగబోతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.