Avesh Khan: కొత్త ఆటగాళ్లకు మాత్రమే రూల్స్.. సీనియర్లకు ఆ చింత లేదా?

డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా కమాండ్‌ తీసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 01:37 PM IST

డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా కమాండ్‌ తీసుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. అయితే తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో ఓ ఆటగాడికి మాత్రం చోటు దక్కలేదు. ఈ సిరీస్‌లోనూ ఈ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు. వెస్టిండీస్‌తో జరిగిన పొట్టి ఫార్మాట్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌కు అవకాశం రాలేదు. ఇప్పుడు ఐర్లాండ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో కూడా తన స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు.

అవేష్ ఖాన్ ఆసియా కప్ 2022 సందర్భంగా టీమిండియా తరపున తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు.అవేశ్ ఖాన్ భారత్ తరపున 15 టీ20లు ఆడాడు. అలాగే 5 వన్డేలు కూడా ఆడాడు. పొట్టి పార్మాట్ లో అవేశ్ ఖాన్ 9.11 ఎకానమీతో పరుగులు ఇచ్చి 13 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అదే సమయంలో వన్డేల్లో 3 వికెట్లు పడగొట్టాడు. 2022 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా తరపున తన చివరి ODI ఆడాడు. 2022 ఆసియా కప్‌లో టీమిండియా ఓటమికి అవేష్ ఖాన్ ఓ కారణమయ్యాడు. అందుకేనా టీమిండియా, అవేశ్ ఖాన్ మీద ఇంకా కనికరం చూపట్లేదు, కొత్త ఆటగాళ్లకేనా ఈ రూల్స్ అన్ని, ఫామ్ లో లేకపోయినా కొందరు సీనియర్లను కంటిన్యూ చేస్తుండడం కరెక్టేనా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.