ODI World Cup : నెదర్లాండ్స్‌ ను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఒకే బంతికి 13 పరుగులు..?

వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. మరో విజయం సాధించింది. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ను కివీస్‌ 99 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మిచెల్ శాంట్నర్‌ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో మెరుపులు మెరిపించాడు.

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒక లీగల్‌ డెలివరీకి అతడు 13 పరుగులు రాబట్టాడు. ఇంతకీ అది ఎలా సాధ్యమైందంటే.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ను నెదర్లాండ్స్ ఫాస్ట్‌బౌలర్‌ ‘బాస్ డి’ వేశాడు. మొదటి నాలుగు బంతుల్లో ఎనిమిది పరుగులు ఇచ్చాడు. చివరి బంతికి నో బాల్‌ వేయగా.. దాన్ని మిచెల్ శాంట్నర్‌ సిక్సర్‌గా మలిచాడు. లోఫుల్‌ టాస్‌గా వచ్చిన ఫ్రీ హిట్‌ను కూడా శాంట్నర్‌ లాంగాన్‌ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో ఒక లీగల్ డెలివరీకి 13 పరుగులు వచ్చినట్లయింది.