India Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ ఆడకుంటే… ఆ ప్లేస్ లో వచ్చేది ఆ జట్టే

ఒకవేళ భారత్ తప్పుకుంటే టోర్నీపై పెద్ద క్రేజ్ ఉండదు. అయితే భారత్ స్థానంలో మరో జట్టును తీసుకుని పాక్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే అవకాశముంటుంది.

మినీ వరల్డ్ కప్ గా భావించే ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యమివ్వబోతోంది. ఈ మెగా టోర్నీకి భారత్, ఆతిథ్య పాకిస్తాన్ తో పాటు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ అర్హత సాధించాయి. అయితే భద్రతా కారణాల రీత్యా పాక్ వెళ్ళేందుకు భారత్ నిరాకరిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో అక్కడ ఆడేది లేదని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పేసింది. తమ మ్యాచ్ తటస్థ వేదికలో నిర్వహిస్తే ఆడతామని కూడా స్పష్టం చేసింది. మరోవైపు పాక్ మాత్రం తమ దేశంలోనే టోర్నీని నిర్వహిస్తామంటూ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ పాక్ తటస్థ వేదికలో మన మ్యాచ్ నిర్వహించకుంటే టోర్నీ నుంచి తప్పుకోవడం మినహా భారత్ కు మరో ఛాయిస్ లేదు.

ఒకవేళ భారత్ తప్పుకుంటే టోర్నీపై పెద్ద క్రేజ్ ఉండదు. అయితే భారత్ స్థానంలో మరో జట్టును తీసుకుని పాక్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే అవకాశముంటుంది. ప్రస్తుతం ర్యాంకింగ్స్ ప్రకారం చూస్తే ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టుకు భారత్ ప్లేస్ లో చోటు దక్కొచ్చు. భారత్ టోర్నీ నుంచి వైదొలిగితే తర్వాతి స్థానంలో ఉన్న లంకకే అవకాశం ఉంటుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా భారీ ఆదాయంపై కన్నేసిన పాక్ బోర్డుకు భారత్ మ్యాచ్ లు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే సక్సెస్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భారత్ తప్పుకుంటే మాత్రం పాక్ బోర్డుకు గట్టి ఎదురుదెబ్బగానే చెబుతున్నారు.