ప్రస్తుత క్రికెట్ లో విండీస్ విధ్వంకర బ్యాటర్ల గురించి ఫ్యాన్స్ కు పరిచయం అక్కర్లేదు. మరీ ముఖ్యంగా వికెట్ కీపర్ నికోలస్ పూరన్ మైదానంలోకి దిగాడంటే బౌలర్లకు చుక్కలే. టీ ట్వంటీల్లో పూరన్ విధ్వంసాలకు లెక్కే లేదు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీ ఈ విండీస్ హిట్టర్ పిచ్చకొట్టుడు కొట్టాడు. సౌతాఫ్రికా ఉంచిన 176 పరుగుల టార్గెట్ ఛేజ్ చేసే క్రమంలో పూరన్ విధ్వంసం హైలెట్ గా నిలిచింది. ప్రత్యర్థి బౌలర్లు బౌలింగ్ చేసేందుకు కూడా భయపడేలా ఆడాడు. పూరన్ కేవలం 26 బంతుల్లోనే 65 పరుగులతో విధ్వంసం సృష్టించాడు పూరన్. 2 బౌండరీలతో పాటు ఏకంగా 7 భారీ సిక్సులు కొట్టాడు పూరన్. 250 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పూరన్ విధ్వంసంతో విండీస్ 17.5 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది.