IPL లో సన్ రైజర్స్ (Sunrisers) తరపున ఎలాంటి అంచనాల్లేకుండా దిగిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి (Nitish Reddy)… అనూహ్యంగా పంజాబ్ టీమ్ (Punjab Team) కి చుక్కలు చూపించాడు. చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు ఆటగాడు గ్రౌండ్ లో చెలరేగి ఆడుతుండటంతో తెలుగు క్రికెటర్ లవర్స్ (Telugu Cricketer Lovers) ఫుల్లు హ్యాపీగా ఫీలయ్యారు. అంబటి రాయుడు (Ambati Rayudu) తర్వాత ఆంధ్ర ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి… IPL లో విధ్వంసం సృష్టించాడు. ఇంతకీ ఎవరీ నితీష్ రెడ్డి అని అంతా క్రికెట్ లవర్స్ ఆరా తీస్తున్నారు.
IPL లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఆటగాడు నితీష్ రెడ్డి మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు బాది మొత్తం 64 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ 182 పరుగులు చేసిందంటే అందుక్కారణం నితీష్ రెడ్డే. వరల్డ్ క్లాస్ క్రికెటర్స్ విఫలమైన టైమ్ లో… గ్రౌండ్ లోకి వచ్చి నితీష్ రెడ్డి సత్తా చాటాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా… బౌండరీలు, సిక్సర్లతో చెలరేగాడు. పంజాబ్ టీమ్ లో రబాడ, కరన్ లాంటి ఇంటర్నేషనల్ పేసర్లను కూడా బాదేశాడు నితీష్ రెడ్డి. ఇప్పుడు సోషల్ మీడియాలో నితీష్ పేరు మార్మోగుతోంది.
ఏపీలోని వైజాగ్ కి చెందిన నితీష్ రెడ్డి… 14యేళ్ళ వయస్సులో విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2017లో 176 యావరేజ్ స్కోర్ చేసి, 26 వికెట్లు తీయడంతో నితీష్ కి బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్16 అవార్డు దక్కింది. 2021లో టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశీవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న నితీష్ ను 2023 IPL వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్… బేస్ ప్రైజ్ కింద 20 లక్షల రూపాయలకు కొనుక్కుంది. ఈ సీజన్ లో రెండే మ్యాచులు ఆడాడు నితీష్.
నితీష్ సక్సెస్ సీక్రెట్ విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నితీష్ ఇలా పంజాబ్ టీమ్ పై రెచ్చిపోవడానికి కారణం… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అట. మ్యాచ్ కు ముందు జానీ మూవీలో… నా రాజుగాకురా మా అన్నయ్యా… పాటను విన్నాడట. ప్రతి మ్యాచ్ కి ముందు ఈ సాంగ్ వింటాడట. ఈ పాట బీట్, లిరిక్స్… తనకు మంచి ఎనర్జీ ఇస్తుందని నితీష్ రెడ్డి చెబుతున్నాడు. ఆయన స్వయంగా పాడిన పాట నెట్టింట వైరల్ గా మారింది.