Asia Cup: ఆ రికార్డును బద్దలుకొడతారా..? బౌలర్ల సత్తాకు పరీక్ష..!

ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలుకానుంది. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. అయితే వన్డే ఆసియాకప్‌లో భారత బౌలర్ల రికార్డు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వన్డే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క భారత బౌలర్ ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 05:13 PM IST

Asia Cup: వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్‌ను గెలిచి నంబర్ వన్ టీంగా వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే వన్డే ఆసియాకప్‌లో భారత బౌలర్ల రికార్డు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వన్డే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క భారత బౌలర్ ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

కాగా, ఆసియా కప్ 2023 రేపటి నుంచి మొదలుకానుంది. ఈసారి ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. అయితే వన్డే ఆసియాకప్‌లో భారత బౌలర్ల రికార్డు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వన్డే ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క భారత బౌలర్ ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. 35 ఏళ్ల క్రితం 1988లో భారత్ తరపున వన్డే ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్ అర్షద్ అయూబ్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అర్షద్ 9 ఓవర్లలో 21 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా గెలిచింది. అయితే ఆ తర్వాత, భువనేశ్వర్ కుమార్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరపున ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు మళ్ళీ ఆ రికార్డును తిరగరాసే అవకాశం ఉండడంతో, ఇప్పుడు అందరి చూపు స్పీడ్ స్టార్లైన, బుమ్రా, షమీ, సిరాజ్ మీద పడింది. అనూహ్యంగా, జడేజా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ ఈ ఘనత సాధించినా కూడా ఆశ్చర్యమేమీ లేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.