Jofra Archer: ఐపీఎల్‌కు జోఫ్రా ఆర్చర్ దూరం.. అసలు కారణమిదే..!

డిసెంబరు 19న దుబాయ్‌లో జరిగే IPL వేలం కోసం నమోదు చేసుకున్న 34 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఆర్చర్ పేరు కనిపించలేదు. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ఆర్చర్ విఫలమయ్యాడు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ కోసం ఆర్చర్‌ను భారత్‌కు పిలిపించారు.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 07:08 PM IST

Jofra Archer: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఐపీఎల్‌లో ఆడాలని ఎందరో కోరుకుంటారు. కానీ ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం ఈ మెగా లీగ్ నుంచి ఒకొక్కరు స్వదేశానికి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే బెన్ స్టోక్స్, రూట్.. ఐపీఎల్ నుంచి తప్పుకోగా తాజాగా ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ వేలానికి తన పేరును ఇవ్వలేదు. అయితే దీనికి అసలు కారణం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనే తెలుస్తుంది. వచ్చే ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉండడంతో ఆర్చర్ మీద ఈసీబీ పనిభారం తగ్గించే ప్రయత్నం చేస్తుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తైలవాస్ బోణీ..

గత వారం ముంబై ఇండియన్స్ విడుదల చేసిన లిస్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పేరు కూడా ఉంది. దీంతో ఆర్చర్ వేలానికి అందుబాటులో ఉంటాడని అందరూ భావించారు. అయితే ఈసీబీ ఆర్చర్‌ను వేలంలోకి తన పేరు ఇవ్వొద్దని చెప్పింది. దీంతో డిసెంబరు 19న దుబాయ్‌లో జరిగే IPL వేలం కోసం నమోదు చేసుకున్న 34 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఆర్చర్ పేరు కనిపించలేదు. ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ఆర్చర్ విఫలమయ్యాడు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ కోసం ఆర్చర్‌ను భారత్‌కు పిలిపించారు. ఇక్కడే కొన్ని రోజులపాటు ప్రాక్టీస్ కూడా చేసాడు. అయితే పూర్తి ఫిట్‌గా లేని కారణంగా ఈ ఇంగ్లాండ్ పేసర్‌ను వరల్డ్ కప్‌లో ఆడించే సాహసం చేయలేదు.

మరోవైపు ఇంగ్లాండ్ ప్లేయర్లు మొయిన్ అలీ, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జాసన్ రాయ్, మార్క్ వుడ్, విల్ జాక్స్, రీస్ టాప్లీలను ఆయా ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి.