వన్డే చరిత్రలో 49 శతకాలు (49 centuries) సాధించిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (Virat Kohli) చరిత్ర సృష్టించాడు. సెంచరీల విషయంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) ను కోహ్లీ సమం చేశాడు. దీంతో సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. వన్డే ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై పుట్టిన రోజునాడు చేసిన శతకం విరాట్‌కు ఎంతో స్పెషల్. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విరాట్‌ను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఉన్న భారమంతా దిగిపోయిందని.. ఇక నుంచి కోహ్లీ మరింత స్వేచ్ఛగా ఆడతాడని తాను భావిస్తున్నట్లు వెల్లడించాడు.
SRILANKA CRICKET BOARD : ప్రపంచ కప్ లో ఘోరంగా ఓటమి.. శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు
‘‘విరాట్‌పై ఉన్న భారమంతా దిగిపోయింది. సచిన్ శతకాల రికార్డును సమం చేశాడు. దీని కోసం తీవ్రంగా శ్రమించి ఉంటాడు. ఇప్పుడు సాధించాడు. అదీనూ కీలకమైన మెగా టోర్నీలో కావడం విశేషం. సెమీస్‌కు ముందు భారత్ లీగ్ స్టేజ్‌లో ఒక మ్యాచ్ ఆడనుంది. అందులోనూ సెంచరీ సాధిస్తే భారత క్రికెట్‌కు గొప్ప రోజుగా మారిపోతుంది. ఇక నాకౌట్ దశలో విరాట్ మరింత స్వేచ్ఛగా ఆడేస్తాడు. ‘ఛేజింగ్ కింగ్’ అనిపించుకున్న కోహ్లీ ఆల్‌టైమ్ ప్లేయర్ల జాబితాలో ముందుంటాడు. అతడి ఆటతీరు అత్యుత్తమం. ఇదే మాటను చాలా ఏళ్ల కిందటే నేను చెప్పా. అతడికేమీ సచిన్ రికార్డును సమం చేయాల్సిన అవసరం లేదు. అతడి బ్యాటింగ్ రికార్డులను గమనిస్తే ఛేజింగ్‌లో అత్యుత్తమంగా రాణించాడు. అందుకేనేమో.. సచిన్ 49 శతకాల రికార్డును సమం చేయడానికి 175 ఇన్నింగ్స్‌లను తక్కువే తీసుకున్నాడు’’ అని పాంటింగ్ తెలిపాడు.