ఒక్క సిరీస్..ఎన్నో రికార్డులు టీమిండియా ఘనతలు ఇవే

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడం ద్వారా టీమిండియా సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా కాన్పూర్ టెస్టులో అద్భుతమైన వ్యూహంతో గెలుపును అందుకుంది

  • Written By:
  • Publish Date - October 3, 2024 / 12:25 PM IST

బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ చేయడం ద్వారా టీమిండియా సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ముఖ్యంగా కాన్పూర్ టెస్టులో అద్భుతమైన వ్యూహంతో గెలుపును అందుకుంది. దమ్మున్న జట్టుకు ఐదురోజులు అవసరం లేదు రెండు రోజులు చాలని నిరూపిస్తూ బంగ్లాను చిత్తు చేసింది. ఈ క్రమంలో భారత్ ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంది. టె 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అత్యధిక రన్‌రేట్ నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. రెండో టెస్ట్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా 7.36 రన్ రేట్ నమోదు చేసింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా రికార్డ్‌ను బద్దలు కొట్టింది. గతంలో
సౌతాఫ్రికా జింబాబ్వేపై రెండు ఇన్నింగ్స్‌ల్లో 6.80 రన్ రేట్ నమోదు చేసింది.

ఇదిలా ఉంటే టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో జట్టుగానూ టీమిండియా రికార్డులకెక్కింది. 180 విజయాలతో సౌతాఫ్రికాను వెనక్కినెట్టింది. 414 విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. 397 విజయాలతో ఇంగ్లండ్, 183 విజయాలతో వెస్టిండీస్ భారత్ కంటే ముందున్నాయి. మరోవైపు సొంతగడ్డపై వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్‌లు గెలిచిన జట్టుగానూ టీమిండియా రికార్డ్ సృష్టించింది. 2013 నుంచి 2024 మధ్య టీమిండియా వరుసగా 18 టెస్ట్ సిరీస్‌లను గెలిచింది. ఈ జాబితాలో భారత్ తర్వాత 10 టెస్ట్ సిరీస్ విజయాలతో ఆస్ట్రేలియా , 8 టెస్ట్ సిరీస్ విజయాలతో వెస్టిండీస్, న్యూజిలాండ్ కొనసాగుతున్నాయి.