Pakistan : ఎంతకు తెగించార్రా..? 

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. ఆసియా కప్‌లో ఘోర పరాజయం.. అలాగే ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌లు రెండింటిలోనూ 300కు పైగా పరుగులు చేసినా పరాజయం కావడంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక మెగా టోర్నీ క్రికెట్‌ ఆరంభంలో పాక్‌ క్రికెట్‌ జట్టు ఆటతీరు చాలా మందిని విస్మయ పరిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. వీటన్నింటి మధ్య పాక్ జట్టు ఇప్పుడు కొత్త వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

లంక ఇన్నింగ్స్ 29వ ఓవర్లో హసన్ అలీ బౌలింగ్ లో భారీ షాట్ ఆడిన మెండిస్ డీప్ మిడ్ వికెట్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇమామ్ ఉల్ హక్ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే ఇమామ్‌ బంతిని క్యాచ్‌ పట్టుకుని కింద పడిపోయాడు. అయితే ఇక్కడ ఇమామ్‌ బౌండరీ లైన్‌ గుర్తును తాకడం స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఎవరో బౌండరీ లైన్‌ను వెనక్కి నెట్టినట్లు అనిపించింది. ఆ తర్వాత ఇమామ్‌ క్యాచ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ జట్టు మోసం చేస్తోందని పలువురు యూజర్లు ట్విట్టర్‌లో ప్రశ్నలు సంధించారు.
శ్రీలంకతో మ్యాచ్‌లోనే  కాదు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాక్‌ ఫీల్డర్లు ఇదే మోసానికి పాల్పడి నట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లోనూ ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఆ మ్యాచ్‌కి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్‌గా మారాయి. ఐసీసీ నిబంధనలకు లోబడి పాకిస్థాన్ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారా లేక గ్రౌండ్ స్టాఫ్ బౌండరీ లైన్‌ను వెనక్కి తరలించారా అనేది ఇప్పుడు స్పష్టంగా తెలియరాలేదు.