Sana Mir: పాకిస్థాన్ శ్రీవల్లి.. రశ్మికలా కనిపిస్తున్న పాక్ క్రికెటర్..!

నేషనల్ క్రష్ రశ్మికను పోలివుండే సనా మీర్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 బౌలర్‌గా నిలిచింది. అలానే విజ్డెన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. రశ్మికను పోలి ఉన్న ఈ మహిళా క్రికెటర్‌కు పాకిస్థాన్‌లో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 05:16 PM IST

Sana Mir: 15 ఏళ్ల పాటు పాకిస్థాన్ ఉమెన్స్ టీమ్ తరఫున మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ సనా.. అచ్చు గుద్దినట్టు మన శ్రీవల్లీ లాగే ఉంటుంది. నేషనల్ క్రష్ రశ్మికను పోలివుండే సనా మీర్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 బౌలర్‌గా నిలిచింది. అలానే విజ్డెన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపికై అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కరాచీ వేదికగా 2005లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సనా.. కెరీర్‌లో 150 వన్డేలాడి 151 వికెట్లు, 106 టీ20 మ్యాచ్‌లాడి 89 వికెట్లు పడగొట్టింది.

ఈ క్రమంలో 2009 నుంచి 2017 వరకూ కెప్టెన్‌గా ఉన్న ఈ దిగ్గజ స్పిన్నర్ మొత్తం 137 మ్యాచ్‌లకి నాయకత్వం వహించింది. 2018లో ఐసీసీ నెం.1 వన్డే బౌలర్‌గా నిలిచిన సనాకి గత ఏడాది నుంచి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. 2019, నవంబరులో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఆడిన సనా మీర్‌పై ఆ తర్వాత వేటు పడగా.. టీ20 జట్టులోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో.. 34 ఏళ్ల సనా మూడేళ్ళ క్రితం కెరీర్‌కి వీడ్కోలు పలికింది. అయితే రశ్మికను పోలి ఉన్న ఈ మహిళా క్రికెటర్‌కు పాకిస్థాన్‌లో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. నెటిజన్లు ఆమెకు ఫ్యాన్స్‌గా మారుతున్నారు.