Umran Akmal: జెర్సీ సినిమాలాగే ఉమర్ అక్మల్ లైఫ్.. జేబులో రూపాయి లేదు..

కమ్రాన్ అక్మల్ సోదరుడైన ఉమ్రాన్ అక్మల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్‌కు గొప్ప బ్యాటర్ దొరికాడంటూ అప్పట్లో ప్రచారం ఒక రేంజ్‌లో జరిగింది. అయితే 2020లో ఫిక్సింగ్ కోసం బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచడంతో ఆగ్రహించిన పీసీబీ ఉమ్రాన్‌పై 3 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 05:19 PM IST

Umran Akmal: అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ప్లేయర్ల లైఫ్ స్టయిల్ చాలా రిచ్‌గా ఉంటుందని అంతా అనుకుంటారు. టి20లీగ్స్ ఎంట్రీతో క్రికెటర్ల రాత పూర్తిగా మారిపోయింది. కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఇదంతా నాణెంకు ఒక వైపు మాత్రమే. ఇంకోవైపు స్టార్ స్టేటస్‌ను హ్యాండిల్ చేయలేక.. డబ్బు కోసం కక్కుర్తి పడి మంచి లైఫ్‌ను పోగొట్టుకున్న ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. వారిలో పాకిస్తాన్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా సల్మాన్ భట్, మొహమ్మద్ ఆసిఫ్, మొహమ్మద్ అమీర్ తమ కెరీర్‌లను నాశనం చేసుకున్నారు.

వీరిలానే మరో పాకిస్తాన్ క్రికెటర్ కూడా తన కెరీర్‌ను నాశనం చేసుకుని ప్రస్తుతం చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ బ్యాటర్ ఉమ్రాన్ అక్మల్ ఉన్నాడు. కమ్రాన్ అక్మల్ సోదరుడైన ఉమ్రాన్ అక్మల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్‌కు గొప్ప బ్యాటర్ దొరికాడంటూ అప్పట్లో ప్రచారం ఒక రేంజ్‌లో జరిగింది. అయితే 2020లో ఫిక్సింగ్ కోసం బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని దాచడంతో ఆగ్రహించిన పీసీబీ ఉమ్రాన్‌పై 3 ఏళ్ల పాటు నిషేధాన్ని విధించింది. అయితే దీనిపై అతడు కోర్టులో అప్పీల్ చేయగా.. శిక్షను 12 నెలలకు తగ్గించారు. 2021తో అతడి నిషేధం పూర్తయ్యింది. అయినప్పటికీ అనంతరం అతడికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

ఇక నిషేధ సమయంలో ఉమ్రాన్ అక్మల్ ఎదుర్కొన్న కఠిన పరిస్థితుల గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆ సమయంలో తాను అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు ఉమ్రాన్ పేర్కొన్నాడు. తన కూతురు స్కూలు ఫీజు కూడా కట్టలేని దీనస్థితిని గడిపానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫీజు చెల్లించలేక దాదాపు 8 నెలల పాటు ఉమ్రాన్ తన కూతురును స్కూలుకు పంపలేదని తెలిపాడు. భార్య అండగా నిలవడంతో తాను ఆ పరిస్థితి నుంచి బయటపడినట్లు పేర్కొన్నాడు.