ద్రావిడ్ కు పవన్ ఫోన్, నేను వస్తున్నా కలుద్దాం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన పని తీరుపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కొన్ని సంస్కరణలకు కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు.

  • Written By:
  • Publish Date - August 19, 2024 / 11:23 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తన పని తీరుపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. కొన్ని సంస్కరణలకు కూడా ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని కూడా ఆయన వదలడం లేదనే చెప్పాలి. సినిమా పరిశ్రమ కోసం ఒక స్టూడియోని ప్రభుత్వం నిర్మించే ఆలోచనలో ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని కూడా తెలిసింది. సినిమా వాళ్ళతో దీనిపై వచ్చే నెల ఆయన సమావేశం కూడా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంచితే… ఇప్పుడు క్రీడా రంగంపై కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అత్యాధునిక హంగులతో క్రీడాకారుల శిక్షణకు సంబంధించి కొన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరుపు నుంచి చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా భారత జట్టు మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల తనకు బెంగళూరు పర్యటన ఉందని, బెంగళూరులో ఇద్దరం భేటీ అవుదామని ద్రావిడ్ కు పవన్ చెప్పారట. దీనికి ద్రావిడ్ కూడా ఓకే చెప్పినట్టు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

అలాగే ఒలంపిక్స్ లో పాల్గొన్న ఆటగాళ్ళతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే ఆలోచనలో ఉన్నారు. జావెలిన్ త్రోకి సంబంధించి ఒక శిక్షణ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేసే యోచనలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. గిరిజన యువకులను ఆ ఆటలో ప్రోత్సహించాలని పవన్ ప్లాన్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. క్రికెట్, జావెలిన్ త్రో, ఫుట్ బాల్ సహా మరో మూడు క్రీడలకు సంబంధించి ప్రభుత్వమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అలాగే పీటీ ఉషాతో కూడా పవన్ సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి క్రీడా శాఖ అధికారులతో పవన్ తన అభిప్రాయాలను పంచుకున్నారట. ఒక ప్లాన్ ను సిద్దం చేయాలని ఆయన ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో ఉన్నారట.