Jay Shah: జైషా పాకిస్థాన్ ప్రయాణం.. శాంతి కోసమేనా..?

ఆసియా కప్‌లో భాగంగా ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జేషాకు పీసీబీ ఆహ్వానం పంపింది. షాతో పాటు, ఏసీసీలో భాగమైన ఇతర బోర్డు సభ్యులను కూడా ఆహ్వానించినట్లు పీసీబీ తెలిపింది.

  • Written By:
  • Publish Date - August 19, 2023 / 04:15 PM IST

Jay Shah: ఆగష్టు 30న ప్రారంభమయ్యే ఆసియా కప్ 2023 ప్రారంభ మ్యాచ్‌ని చూడాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జైషాకు ఆహ్వానం పంపింది. ఆసియా కప్‌లో భాగంగా ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న జేషాకు పీసీబీ ఆహ్వానం పంపింది. షాతో పాటు, ఏసీసీలో భాగమైన ఇతర బోర్డు సభ్యులను కూడా ఆహ్వానించినట్లు పీసీబీ తెలిపింది.

అయితే ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ని చూసేందుకు తాను పాకిస్థాన్‌కు వెళ్లనని జైషా ముందుగానే స్పష్టం చేశారు. పాకిస్థాన్ నుంచి అధికారికంగా ఆహ్వానం అందిన తర్వాత జైషా తన వైఖరిని మార్చుకుని తొలి మ్యాచ్‌కు హాజరవుతాడో లేదో చూడాలి. ఆసియా కప్ ఆతిథ్యం విషయంలో గతంలోనూ అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ టోర్నీ కోసం తమ జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌ను పాకిస్థాన్ వెలుపల నిర్వహించాలని కూడా ప్రతిపాదించారు. ఈ కారణంగానే ఆసియా కప్‌లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే పాకిస్థాన్‌లో జరగనుండగా, మిగిలిన మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నాయి.