షార్ట్ ఫార్మాట్ అంటేనే బ్యాటర్లకు పండుగ…ఇక హిట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్స్ ను నిలువరించడం బౌలర్లకు కష్టమే.. టీ ట్వంటీలంటే చాలు రెచ్చిపోయే పూరన్ సిక్సర్ల మీద సిక్సర్లు బాదేస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు.ఇటీవల సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలుకొట్టిన పూరన్ తాజాగా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 140 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న మూడో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.28 ఏళ్ల వెస్టిండీస్ వికెట్ కీపర్ పూరన్ 89 ఇన్నింగ్స్‌ల్లోనే 140 సిక్సర్లను బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు సాధించిన జాబితాలో రోహిత్ శర్మ, మార్టిన్ గప్తిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రోహిత్ 151 ఇన్నింగ్స్‌ల్లో 205 సిక్సర్లు , గప్తిల్ 118 ఇన్నింగ్స్‌ల్లో 173 సిక్సర్లు కొట్టారు.