India vs New Zealand: రివేంజ్ పక్కా అంటున్న భారత్.. న్యూజిలాండ్‌పై గెలుపే లక్ష్యం..!

కన్నీళ్లకు బదులు తీర్చుకునే అవకాశం భారత జట్టుకు వచ్చింది. ప్రపంచ కప్‌-2023లో భాగంగా సెమీస్‌ పోరులో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్‌ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 06:58 PM IST

India vs New Zealand: సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌ (semi finals)లో భారత్, న్యూజిలాండ్‌ (New Zealand) జట్లు తలపడ్డాయి. లీగ్‌ దశలో వరుస విజయాలతో సెమీస్‌ చేరిన టీమిండియా కివీస్‌ ముందు బోల్తాపడింది. న్యూజిలాండ్‌ విధించిన 240 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక 221 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయి కోహ్లీ సేన ఇంటిదారిపట్టింది. 72 బంతుల్లో 50 పరుగులు చేసిన ధోని అనూహ్యంగా రనౌట్‌ కావడం మ్యాచ్‌లో కీలక మలుపు.

Siddaramaiah: కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

టీమిండియా ఓడిపోవడంతో ధోని, కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా టీమిండియా క్రికెటర్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక కోట్లాది మంది భారత అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడీ కన్నీళ్లకు బదులు తీర్చుకునే అవకాశం భారత జట్టుకు వచ్చింది. ప్రపంచ కప్‌-2023లో భాగంగా సెమీస్‌ పోరులో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మళ్లీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి 2019 ప్రపంచకప్‌ పరాభవానికి లెక్క సరిచేయాలని కోట్లాది మంది భారత అభిమానులు కోరుకుంటున్నారు. పాక్‌ సెమీస్‌ చేరాలంటే సుమారు 250 నుంచి 300 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించాలి. అద్భుతం జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి సెమీ ఫైనల్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

భారత్ వర్సెస్‌ న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్ నవంబర్ 15న జరగనుంది. 2011లో మనకు ప్రపంచ కప్‌ అందించిన ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌కు వేదిక కానుంది. లీగ్‌ దశలో భారత్‌ న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే నాకౌట్‌ బలహీనత టీమిండియాను వేధిస్తోంది. మరి ఈ ఒత్తిడిని అధిగమించి రోహిత్ సేన న్యూజిలాండ్‌ను ఓడించాలంటే బాగా శ్రమించాల్సిందే.